Food Storage: భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను నిర్దిష్ట ధరల వద్ద కొనుగోలు చేసి, నిల్వ చేసి, అవసరమైన సమయంలో ప్రజలకు అందించే వ్యవస్థను “ఆహార నిల్వలు” అంటారు. ఈ వ్యవస్థ ఆహార భద్రతను కల్పించడానికి, అనాహారం నివారించడానికి, మరియు ఆహార ధరలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆహార భద్రత( Food Storage ) కల్పించడం.. అనాహారం నివారించడం.. ఆహార ధరలను స్థిరంగా ఉంచడం.. రైతులకు మద్దతు అందించడం.. ఎమర్జెన్సీ సమయాలకు సన్నద్ధత పొందడం జరుగుతుంది.
భారత ప్రభుత్వం ఆహార నిల్వలను నిర్వహించడానికి ప్రధాన కారణాలు
వరదలు, కరువులు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే అనాహార పరిస్థితులను నిరోధించడానికి, ఆహార ధరలను స్థిరంగా ఉంచడానికి, దేశంలోని ప్రజలకు సరిపడా ఆహారం అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి, ఆహార దిగుమతులపై ఆధారపడకుండా దేశాన్ని స్వయం సమృద్ధిగా ఉంచడానికి, యుద్ధాలు, తిరుగుబాట్లు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో ఆహార( Food Storage ) సరఫరాను నిర్వహించడానికి, రైతులకు వాస్తవిక ధరలు లభించేలా చూసుకోవడానికి, వారి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, అదనపు ఆహారాన్ని ఎగుమతి చేసి దేశీయ ఆదాయాన్ని పెంచుకోవడానికి.. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఆహారనిల్వలను నిర్వహించడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఆహార నిల్వలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు
భారత ప్రభుత్వం ఆహారనిల్వలను నిర్వహించడానికి ప్రధాన సంస్థగా Food Corporation of India (FCI)ని ఏర్పాటు చేసింది. FCI ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, నిల్వ చేసి, విక్రయిస్తుంది. FCI ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధర (MSP) వద్ద రైతుల నుండి ధాన్యాలను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియను “Procurement Operations” అంటారు.
FCI దేశవ్యాప్తంగా ఉన్న గోదాములలో ఆహారధాన్యాలను నిల్వ చేస్తుంది. ఈ గోదాములు సరైన నిల్వ పరిస్థితులను కల్పించేలా నిర్మించబడతాయి.అవసరమైన సమయంలో, FCI ఆహార ధాన్యాలను ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇది ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా జరుగుతుంది.ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆహార ధాన్యాల నిల్వలను నిర్వహిస్తుంది. ఈ నిల్వలను “Buffer Stocks” అంటారు.
Food Storage – ఆహార నిల్వల ప్రాముఖ్యత
భారత ప్రభుత్వం ఆహారనిల్వలను నిర్వహించడం దేశంలోని ఆహార భద్రతకు అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది అనాహారం, ఆహార ధరల హెచ్చింపు, మరియు ఇతర సమస్యలను నిరోధించడంలో సహాయపడుతుంది.
Food Storage – ఆహార భద్రత చట్టం (Food Security Act)
2013లో ఆహార భద్రత చట్టం (Food Security Act) అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి వ్యక్తికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో ఉంది. చట్టం ప్రకారం, ప్రభుత్వం నిర్దిష్ట ధరల వద్ద ఆహారధాన్యాలను ప్రజలకు అందించాలి.
Food Storage – ఆహార నిల్వల సవాళ్లు
గోదాముల నిర్వహణ, నిల్వ పరిస్థితులను కాపాడటం, మరియు కీటకాలను నియంత్రించడం సవాళ్లుగా ఉన్నాయి. ఆహారధాన్యాల నాణ్యతను కాపాడటం మరియు వాటిని క్షీణత నుండి రక్షించడం ముఖ్యం. ఆహారనిల్వలను నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఆర్థిక భారం వహిస్తుంది.
Food Storage – ఆహార నిల్వల భవిష్యత్తు
ఆహార నిల్వల సవాళ్లను పరిష్కరించడానికి పరిశోధన మరియు అభివృద్ధి అవసరం. ఆహారనిల్వల నిర్వహణలో టెక్నాలజీని ఉపయోగించడం మరింత సమర్థవంతమైన మరియు ఖర్చు తగ్గించే మార్గాలను అందిస్తుంది. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మరియు సమాజం మధ్య సమైక్య ప్రయత్నాలు ఆహారనిల్వల సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడతాయి.
ఇక ఇప్పటివరకు మనం భారత ప్రభుత్వం ఆహార నిల్వలను నిర్వహించడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా… మరి ఇప్పుడు మనం ఆహార వృథాకి సంబంధించి భారత్‌లో దాదాపు లక్షకోట్ల నష్టం వాటిల్లుతోంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి..? అనేది ఇప్పుడు చూద్దాం…
భారత్‌లో ఆహార వృథా – దాదాపు లక్ష కోట్ల నష్టం – సమస్యను అధిగమించేది ఎలా..?
మనిషి మనుగడకు ఆహారమే ఆధారం. కాలే కడుపులకు, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకి, శ్రమనే ఆయుధంగా చేసుకొని పంటసాగు చేసే అన్నదాతల దృష్టిలో దీని విలువ నిజంగా వెలకట్టలేనిది. కానీ, కోట్లాది చేతులు ఓ వైపు అన్నమో రామచంద్రా అని ఎంతో ధీనంగా వేడుకుంటూ ఉంటే, మరో వైపు ఆహారాన్ని భారీగా వృథా చేస్తున్న పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి.
ఈ విషయాన్ని ప్రపంచ ఆహార వృథా సూచీ నివేదిక-2024 నివేదిక స్వయంగా వెల్లడించడం జరిగింది. ఇక మరోవైపు ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారం గనుక మనం చూస్తే.. 78.3కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా ఒకవైపు ఆహార వృథా మరోవైపు ఆహార కొరత ప్రపంచానికి పరిష్కారం లేనటువంటి సమస్యలుగా మారాయి. భారత్‌లోనూ ఆహార వృథా అధికంగానే ఉంది.
మరి దీనికి అంతే లేదా? లోపం ఎక్కడ ఉంది? ప్రజల్లో ఏ మాత్రం అవగాహన అవసరం… వీటన్నింటి గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. కూడు, గూడు, గుడ్డ మనిషి జీవనానికి కనీస అవసరాలు. ముఖ్యంగా కూడు ఉంటేనే గూడు గుడ్డను సంపాదించుకోగలం. మరోలా చెప్పాలంటే మన పెద్దలు అంటూ ఉంటారు కదా.. కూటి కోసం కోటి తిప్పలు అని, ఆ విధంగా ప్రపంచంలోని ప్రతీ జీవి ఆహారం కోసమే నిత్యం శ్రమిస్తుంది.
కానీ, కనీసం ఆహారం దొరక్కా ఎన్నో కోట్లాదిమంది ప్రజలు కడుపు కాలి ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు కోట్ల టన్నుల ఆహారం అనేది వృథా అవుతున్న దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆహార సూచీ-2024 నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ఆహార వృథా సూచీ దీనికి సంబంధించి అనేక గణాంక లెక్కలతో నివేదిక రిలీజ్ చేసింది.
Food Storage – ఆహార వృధాపై UN నివేదిక
ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 2021వసంవత్సరంలో ఉత్పత్తైన ఆహారంలో 19% వృథా అయినట్లు నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. ప్రతి మనిషి ప్రతి సంవత్సరం 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానమని ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా తెలుస్తోంది.
2019లో 17% ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి 2% పెరిగి 19శాతానికి చేరినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన 12% ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తెలిసింది. ఆహార వృథాని అరికట్టేందుకుగాను ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటూ పలు దేశాలు గొప్పలు చెబుతున్న వేళ తాజా గణాంకాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.
Food Storage – ఆహారం వృధా కావడానికి కారణాలు
ఆహార వృథాకు సంబంధించి ప్రజల సామాజిక అలవాట్లు కూడా కారణమనే ఒక వాదన ఇప్పటినుంచి కాదు.. ఎప్పటి నుంచో ఉంది. వివాహాలు, ఇతర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే విందు భోజనాల ఏర్పాట్లలో పెద్దఎత్తున ఆహార వృథా జరుగుతోంది. వేడుకలు ఎలా నిర్వహించుకోవాలి అన్నది వ్యక్తిగత విషయమే అయినా కూడా ఈ సందర్భంగా జరుగుతున్న వృథాయే కలవరపెడుతోంది.
విందు సందర్భంగా హోదాను చాటుకునేందుకుగాను లెక్కలేనన్ని ఆహార పదార్థాలను వండి వడ్డించడం, అలాగే అన్ని పదార్థాలను తినలేక వచ్చిన అతిథులు వదిలేస్తున్న ఉదాహరణలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి ఉంటాయి. గెస్టులు తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు వేస్ట్ గా చెత్త కుండీల పాలవుతోంది.
అలా మిగిలిన ఆహార పదార్థాలను కొంతమంది పేదలు, స్వచ్ఛంద సంస్థలు, ఫుడ్ బ్యాంకులకు అందిస్తున్నా కూడా ఎక్కువ శాతం అనవసరంగా వేస్ట్ గానే పోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాగే జరుగుతోంది.
Food Storage – ఆహార నష్టమూ అధికమే
ఇకపోతే ఆహార వృథా పరిస్థితి ఇలా ఈవిధంగా ఉంటే ఆహార నష్టం కూడా ఎక్కువగానే ఉంది. పంట కోతల తరువాత, చిల్లర విపణి స్థాయిలో ఆహారం వినియోగానికి పనికి రాకుండా పోవడాన్ని ఎంతో మంది ఆహార నష్టంగా చెప్పడం జరుగుతోంది. కాగా, ఆహార వృథాను వృథాగానే చూడకుండా దానికి ఓ రైతు పడే కష్టాన్ని లెక్కగడితే దాని విలువను మనలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి ఆరుగాలం ఎంతో కష్టపడి శ్రమించే అన్నదాత కష్టానికి ఫలితమే ఆహార లభ్యత. కానీ, ఆ ఆహార ధాన్యాలు పంటపొలం నుంచి నేరుగా మార్కెట్‌లోకి వచ్చే క్రమంలోనూ ఎక్కువగా నష్టమే జరుగుతోంది.
Food Storage – వృథా అవుతున్న రైతుల కష్టం
లక్షల టన్నుల మేర ఆహారం వృథా కావడం వల్ల ఆ మేరకు పంటలు పండించేందుకు ఉపయోగించిన నీరు, పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, రైతున్నల యొక్క కష్టం.. ఇలా చెప్పుకుంటూపోతే అన్నీ కూడా వృథా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహార పదార్థాలు సుమారు 30శాతం సాగు భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో సమానమని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
భారత్ లాంటి దేశాల్లో ఆహార వృథాను లెక్కించడానికిగాను ట్రాకింగ్ వ్యవస్థలు అనేవి సరిగ్గా లేవు. ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, సౌదీ అరేబియాలు ఇందుకు సరైన వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
భారత్‌లో ఆహార సరఫరాలో వృథా వల్ల లక్ష కోట్ల రూపాయల నష్టం
ఆహార సరఫరాలో నష్టాలు, వృథా వల్ల ప్రపంచానికి సుమారు రూ.83 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. భారత్‌లో ఈ నష్టం దాదాపుగా లక్ష కోట్ల రూపాయలని అంచనా వేశారు. ఆహార వృథా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. ఆహార వ్యర్థాలను డంపింగ్ యార్డులు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు.
అవి కుళ్ళిపోయే క్రమంలో ఎంతో హానికరమైనటువంటి ప్రమాదకరమైన ఉద్గారాలు వాతావరణంలోకి వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో 10% వరకు కుళ్ళిన ఆహారం నుంచే వస్తున్నట్లు అంచనా వేయడం జరుగుతోంది. కాబట్టి, ఆహార సరఫరా విషయంలో వృథా చేయకుండా లక్ష కోట్ల రూపాయల నష్టం జరగకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.జరగకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read : అత్యవసర నిధులు, వాటి కేటాయింపులు EEF