Temples: సైన్స్ కి సైతం జవాబు చెప్పలేని ప్రత్యేక ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అందుకే భారత దేశాన్ని మిస్టరీల భూమి అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోబోయే ప్రదేశాలకు సంభంధించి కొంత మంది ఎటువంటి రహస్యం లేదు అది కేవలం పురాణాలలో మాత్రమే చెప్పబడినది అని, మరికొంతమంది కాదు ఇది నిజమే అని వాదిస్తుంటారు.
ప్రస్తుతం మీకు ఇక్కడ చెప్పబడుతున్న ప్రదేశాలు భారత దేశంలో మత సంభంధమైన ప్రదేశాలు. మరి అంతుపట్టని రహస్యాలు గల ఆ ఆలయాలు ఏవి? అవి ఎక్కడ ఉంటాయి? అనేది ఇప్పుడు మనం చూద్దాం…
Yaganti Temple in Andhrapradesh
యాగంటి ఆలయం – ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రం.. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ప్రాధాన్యత గల ఆలయం. శివరాత్రి పర్వదినాన రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడున్న శివుని అనుగ్రహం కోసం వస్తుంటారు. ఈ ఆలయాన్ని 15 వ శతాబ్ధానికి చెందిన, మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు కట్టించడం జరిగింది.
ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకొన్నది ఏంటంటే… పుష్కరణి. దీనినే ఆగస్త్య పుష్కరణి అని అంటారు. భారత దేశం మొత్తం మీద మీరు ఏ ప్రాంతంలో చూసినా పురాతన దేవాలయాలలో కొలనులు తప్పకుండా ఉంటాయి. పుష్కరణిలో నీళ్ళు మీరు ఏ మాసంలో చూసినా ఒకేవిధంగా ఉంటాయి.
ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయో, ఎలా కొండ చివరి భాగం వరకు పోతాయో ఎవ్వరికీ తెలీదు. కొండమీద నుంచి వచ్చే నీళ్ళు ఎల్లప్పుడూ చాలా తాజాగా, రుచికి తియ్యగా ఉంటాయి. ఇక్కడున్న మరొక వింత ఏంటంటే… నంది విగ్రహం ఏటేటా పెరగడం.
Veerabhadra Swamy Temple – Lepakshi
వీరభద్ర ఆలయం – లేపాక్షి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్ర ఆలయం ఉంది. పూర్తిగా విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో జరిగిన ఈ దేవాలయంలోని భారీ స్తంభాలు, గోడలపై చెక్కబడినటువంటి శిల్పాల నిర్మాణం ఇటు పర్యాటకుల్ని, అటు చరిత్రకారుల్ని సైతం అబ్బురాపరుస్తున్నాయి.
సుమారు 70 స్థంబాలు ఉన్న ఈ ఆలయ( Temple ) ప్రాంగణంలో కేవలం ఒకేఒక్క స్తంభం మాత్రం ప్రతీఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందరూ ఆ స్తంభం వైపే పరుగులు పెడుతుంటారు. ఇంతకీ ఈ స్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పలేదు కదూ.. నేలకు, స్తంభానికి ఖాళీ ఉంటుంది.
ఆ మధ్యలో నుంచి పేపర్లు, దారం, బట్టలను ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపు నుంచి బైటికి వస్తుంటాయి. అంత బరువైనటువంటి ఈ స్తంభాన్ని అసలు ఎలా వేలాడదీసారో ఎవ్వరికీ అర్థం కాదు. అదీగాక ఇన్ని శతాబ్దాలుగా ఆ స్తంభం అలాగే వేలాడుతూ ఉండటం మరొక విచిత్రం.
Thepperumanallur Temple – Tamilnadu
తెప్పేరుమనళ్ళూర్ – తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని తెప్పేరుమనళ్ళూర్ వద్ద ఉన్న శివాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరచూ వస్తుంటారు. ఇక్కడ 2010 వ సంవత్సరంలో భక్తులు ఒక అద్భుత సంఘటన చూడటం జరిగింది. అదేంటంటే ఆలయ పూజారి రోజువారీ కార్యక్రమాలను చేసుకుంటుంటే ఒక పాము తన నోటిలో ఆకును పట్టుకొని వచ్చి శివుని విగ్రహం మీద పెట్టింది. అది చూసి భక్తులు, ఆలయ పూజారి నివ్వెరపోయారు.
Somnath Temple – Gujarat
సోమనాథ ఆలయం – గుజరాత్
సోమనాథ ఆలయాన్ని 11 వ శతాబ్ధంలో కట్టారు. ప్రస్తుత కట్టడాన్ని 1951 వ సంవత్సరంలో పునర్నిర్మించారు. ఈ ఆలయ( Temple ) చరిత్ర గురించి మీరు చదివే ఉంటారు. ఈ ఆలయానికి చెందిన సంపద కోసం చాలానే యుద్ధాలు జరిగాయి అంటే లక్ష్యం రాజ్యం కాదు.. సంపద అన్నమాట. 17 సార్లు నాశనం చేయబడ్డ ఈ ఆలయం తర్వాత జరిగినటువంటి పునర్నిర్మాణంతో పురాతన శోభను సంతరించుకుంది.
ఈ ఆలయ విచిత్రాల్లో ఒకటి చంద్రుడు ఈ యొక్క ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎలాంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత అనే చెప్పాలి. చంద్రగ్రహణ కాలంలో పెద్దఎత్తున భక్తులు ఇక్కడకి రావడం ఆనవాయితీ.
Hazrat Sharfuddin Shah Wilayat – Uttar Pradesh
హాజరాత్ శర్‌ఫుద్దీన్ షా విలయత్ – ఆమ్రోహా – ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
హాజరాత్ శర్‌ఫుద్దీన్ షా విలయత్, ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి పుణ్యాత్ముడు. ఈయన సన్నిధి (ఆలయం) మొత్తం కూడా నల్లని తేళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఈ తేళ్ళు హానికరమైనవి కావు. అంతే కాదు చేయి మీద కూడా పాకించుకోవచ్చు. ఇవి మీ మీద ఎటువంటి దాడి చేయవు. మామూలుగా ఈ నల్లటి జాతులకి చెందిన కొన్ని తేళ్ళు అనేవి (ఇవి కావు) కుడితే గనుక నొప్పి అనేది ఉంటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.
భక్తులు ఈ నల్లని తేళ్ళని ఆలయ సిబ్బంది యొక్క అనుమతి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. గమనిక తీసుకొని వెళ్ళేటప్పుడు తిరిగొచ్చే తేదీని చెప్పి ఆతర్వాత తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం నుంచి బయటకి తీసుకొని మీ ఇంటికి వెళ్ళినా కూడా ఈ తేళ్లు కుట్టవు. కానీ, దీనిని మీరు తీసుకొని వెళ్ళి , రిటర్న్ తేదీలోపు ఆలయంలో పెట్టకపోతే ఇవి మిమ్మల్ని కుడతాయి.
Shree Vijaya Vitthala Temple – Hampi
విఠల ఆలయం – హంపి
విఠల ఆలయం కర్నాటక రాష్ట్రంలోని హంపిలో ఉంది. హంపిని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని మరియు శిధిలాల నగరం అని కూడా పిలుస్తారు. హంపి నగరాన్ని ధనిక రాజవంశాలలో ఒకరైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన విజయనగర రాజులు నిర్మించడం జరిగింది. ఈ రాజ్యం సిరిసంపదలతో దీవించబడ్డది కాబట్టి, రాజులు అనేకానేక కట్టడాలు నిర్మించడానికి నడుంబిగించారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది విఠల ఆలయం.
అలంకరించబడిన చెక్కడాలు, స్థంబాలు గల ఈ దేవాలయంలో మీరు చూడవలసింది రంగ మండపంలో ఉన్నటువంటి మ్యూజికల్ స్థంబాలు. వాటిని ఎవరైనా ముట్టుకుంటే చాలు ఇప్పటికీ స రి గ మ ప ద ని అంటూ సంగీతం మనకు వినిపిస్తుంది. ఇదే ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించి, మన్నలలను పొందింది. ఇది ఆనాటి శిల్పకళా చాతుర్యానికి కలికితురాయి.
Kamar Ali Darvesh Dargah – Pune
కమర్ అలీ దర్వేష్ దర్గా – పూణే
ఈ దర్గా మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరానికి 19 కి.మీ దూరంలో ఉన్న శివ్‌పూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ ముస్లీంల వేడుక ఉరుసు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకుంటారు. ఈ దర్గాలో 70 కేజీల బరువున్న ఒక బండరాయి ఉంది. ఈ రాయిని వచ్చిన భక్తులు అవలీలగా పైకి ఎత్తుతుంటారు. విసిరితే గాలి మధ్యలో సులభంగా తేలుతుంది. ఈ రాయిని ఇంత తేలికగా ఎలా పైకి ఎత్తగలమో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.
Gurudwara Sri Amb Sahib – Punjab
అంబ సాహిబ్ గురుద్వారా – మొహాలి
అంబ సాహిబ్ గురుద్వారా పంజాబ్ రాష్ట్రంలోని మొహాలిలో ఉంది. 7 వ సిక్కు గురువు గురు హర రాయ్ జి, తన ముత్తాత గురు అర్జన్ దేవ్ జికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ గురుద్వారా ప్రదేశాన్ని సందర్శించి భక్తులకు దీవెనలను ప్రసాదించినాడు. ఇక ఇక్కడున్న మిస్టరీయే మామిడి చెట్టు. ఈ చెట్టు ఏడాది పొడవునా తియ్యటి మామిడి పండ్లను ఇస్తుంది. సిక్కు గురువు ఇచ్చిన దీవెనల ఫలితంగా ఇక్కడున్న ఈ చెట్టు సంవత్సరంలోని 365 రోజులు ఫలాన్ని భక్తులకి ప్రసాదిస్తుంది.
Brihadeeswara Temple – Thanjavur
బృహదేశ్వర దేవాలయం – తంజావూర్
తంజావూర్ లోనే కాదు… దక్షిణ భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా ముద్రపడ్డ బృహదేశ్వరాలయం, శిల్పకళలకూ సాంస్కృతిక చారిత్రక ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తోంది. మందపాటి పునాదులతో ఎతైన స్తంభాలతో మరింత ఎతైన గోపురాలతో అలరారే ఈ ఆలయం నిత్యం ధూప దీప నైవేద్యాలతో.. భక్తుల యొక్క శివనామ స్మరణతో కళకళలాడుతూ మారుమ్రోగుతూ ఉంటుంది.
అయితే ఈ ఆలయంలో మనకు తెలియని ఒక రహస్యం అనేది దాగి ఉంది. అది ఏమిటంటే.. గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు’ ఎవ్వరికీ కనిపించవు. ఏడాది పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా కూడా ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది.
Kalakaleshwara Temple – Gajendragad
గజేంద్ర ఘడ్ – గడగ్ – కర్నాటక
ఉత్తర కర్నాటక జిల్లా అయిన గడగ్ లోని గజేంద్ర ఘడ్ లో ఉన్నటువంటి ఆలయాన్ని దక్షిణ కాశి అని పిలుస్తుంటారు. అతి పెద్ద వరుసల మెట్లు మిమ్ములను కొండపై గల టెంపుల్ కు చేరుస్తాయి. గుడికి సమీపంలో వెలుపలి వైపుగా నిరంతరం ఎప్పుడూ నీరు వుండే ఒక కొలను లేదా దిగుడు బావి అనేది ఉంది. ఈ నీరు ఎక్కడ నుండి ప్రవహిస్తుంది అనేది ఒక మిస్టరీ.
పక్కనే గల ఒక రావి చెట్టు నుంచి నీటి బిందువులు నిరంతరం కొలనులోకి పడుతూ ఉంటాయి. ఇక అసలు మిస్టరీ లోకి వస్తే… ప్రతి సంవత్సరం వచ్చే కన్నడ ఉగాది పండుగ ముందు రోజు టెంపుల్ పూజారి తన డ్యూటీగా ఒక హుక్కా మరియు కొంత సున్నపు నీరు అక్కడ వుంచుతాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే, ఎవరికీ అర్ధం కాని రీతిలో టెంపుల్ గోడల లోపలి భాగం అంతా సున్నం వేయబడి ఉంటుంది.
దీని పట్ల కొంత మంది వ్యక్తులు ఆసక్తి చూపినా కూడా అంతుపట్టలేదు. ఒకప్పుడు ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో ఒక పెద్ద గంటను ఒక కుంగ్ ఫు చేసే వ్యక్తి బలంగా మోదగా, ఆ గంట అప్పటివరకూ ఎవరూ విననంత శబ్దంతో గంటలు కొడుతూ గాలిలోకి లేచి మాయం అయిపోయినదని చెపుతారు. ఆ గంట ఆ ప్రదేశం నుంచి మాయమైన తరువాత ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి వచ్చిందని నేటికీ చెబుతుంటారు.
Also Read: దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ ఎలా వచ్చింది..? ఆ రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి..