Tirupati Laddu :తిరుమల తిరుపతి లడ్డులో నెయ్యి కి బదులుగా జంతువుల కొవ్వు..!

Written by admin

Updated on:

శ్రీవారి ప్రసాదం తిరుపతి లడ్డు..!

Tirupati Laddu: హిందువులందరు తమ ఆరాద్యునిగా తిరుమల తిరుపతి లో కొలువుండే శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు చాలా పవిత్రమైనది. బాష తో సంబంధం లేకుండా తమిళనాడు , కర్ణాటక ఇలా చాలా ప్రదేశాల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు.

అలాగే తిరుమల తిరుపతి లో శ్రీవారి ప్రసాదం తిరుపతి లడ్డు( Tirupati Laddu )చాలా పవిత్రమైనది. చిన్నవారి నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంతో దీని తింటారు.

నిజం బయటపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం..!

కానీ ప్రస్తుతం ఈ తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశం లో సంచలనంగా మారింది. దేశంలోని ప్రజలందరూ ఈ తిరుమల వేంకటేశ్వరుడిని అలాగే శ్రీవారి లడ్డుని ఎంతో సెంటిమెంట్ భావిస్తారు. అలంటి తిరుమల లడ్డు గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. తిరుమల లడ్డు నాణ్యత పై ఆరోపణలు రావడం తో దానిని జులై 8న ల్యాబ్ కి పంపించగా జులై 17 న ల్యాబ్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి.

అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నెయ్యి తో చేయవలిసిన శ్రీవారి లడ్డుని జంతువుల కొవ్వుతో తయారు చేసారు అని స్పష్టం చేసారు.అలాగే జగన్ గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దిగజార్చడాని వ్యాఖ్యలు చేసారు దినికి వైసిపి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.

అయితే ఈ లడ్డులో(Tirupati Laddu) చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తో తాయారు చేయాల్సిన శ్రీవారి లడ్డు ని జంతువుల కొవ్వుతో కలిపారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

తిరుపతి లడ్డు వివాదం పై స్పందించిన వైఎస్ షెర్మిల..!

Tirupati laddu

చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చింది. దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ వైవి సుబ్బారెడ్డి ఛాలంజ్ చేసారు. అయితే తాజాగా చంద్రబాబు చేసిన ఆరోపణల పై వైఎస్ షెర్మిల ట్విట్టర్ ని వేదికగా చేసుకొని చంద్రబాబు మరియు జగన్ దేవుడిని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

https://twitter.com/realyssharmila/status/1836635507729797376

అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉంది భారత దేశం అంత ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు(Tirupati Laddu) పై చేసిన ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రవిత్రతకు , ప్రతిష్టకి భంగం కలిగించేలా ఉన్నాయి అని స్పష్టం చేసింది.

అలాగే చంద్రబాబు చేసిన ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశమే లేకుంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు లేదా సిబిఐ తో విచారణ చేపట్టి నీచులేవ్వరో బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ట్విటర్ వేదికగా షెర్మిల రాసుకొచ్చారు. మరి ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read : ప్రభుత్వం బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తుంది?

Leave a Comment