Telangana Education Budget 2024-25 (తెలంగాణలో విద్య బడ్జెట్)

Written by Sandeep

Updated on:

Telangana Education Budget 2024-25 : తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్య రంగానికి రూ. 21,292 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరానికి పోలిస్తే 11.5% పెరుగుదల. ఈ నిధులు విద్యా రంగ అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం ఉపయోగించబడతాయి.

తెలంగాణ విద్య బడ్జెట్ పూర్తి వివరాలు.

Telangana Education Budget 2024-25 :

విద్య రంగానికి భారీ నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల నాణ్యత మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థుల సంక్షేమం ద్యేయంగా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు, పౌష్ఠిక భోజనం వంటి సంక్షేమ పథకాలకు నిధులు పంచబడతయి. ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలు, కళాశాలల అభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి.

Telangana Education Budget 2024-25 : నిధుల వినియోగం

ప్రభుత్వ పాఠశాలల భవనాల నిర్మాణం, మరమ్మత్తు, సిబ్బంది నియామకం, పాఠ్యపుస్తకాలు, ఇతర అవసరాల కోసం నిధులు ఉపయోగించబడతాయి.
ఉన్నత విద్య: కళాశాలలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధి, ప్రయోగశాలలు, లైబ్రరీలు, హాస్టళ్లు, ప్రొఫెసర్ల నియామకం కోసం నిధులు ఉపయోగించబడతాయి.
విద్యార్థుల సంక్షేమం: మేధావి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం, భోజనం, ఇతర అవసరాల కోసం నిధులు ఉపయోగించబడతాయి.

Telangana Education Budget 2024-25 : ప్రాథమిక విద్య

ప్రభుత్వ పాఠశాలల భవనాల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత. ఉపాధ్యాయులు నియామకం, శిక్షణకు ప్రాధాన్యత. మౌలిక సదుపాయాలు, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్: తెలుగు భాషా మాధ్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులు.

Telangana Education Budget 2024-25 : ఉన్నత విద్య

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ప్రాధాన్యత. పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం. వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి పాలిటెక్నిక్‌లు, ఇంజనీరింగ్ కళాశాలల అభివృద్ధి.

విద్యార్థుల సంక్షేమం

విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్‌లు అందించడం. విద్యార్థి హాస్టళ్లలో మెస్సు సౌకర్యాల మెరుగుదల. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల నిర్వహణ. విద్యార్థులకు సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ సేవలు.

విద్యా నాణ్యత మెరుగుదల

ఉపాధ్యాయులకు తరగతి గది పనితీరు, సాంకేతిక విద్య, నైపుణ్య అభివృద్ధిపై విస్తృత శిక్షణ. పాఠ్యపుస్తకాల నవీకరణ ఆధునిక విధానాలకు అనుగుణంగా నవీకరించడం మరియు అభివృద్ధి చేయడం. విద్యా విధానాలను మెరుగుపరచడానికి పరిశోధన మరియు విశ్లేషణకు ప్రోత్సాహం.

సర్వ విద్య, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ. పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరచడం. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించడం.

ఉన్నత విద్యలో ప్రొఫెసర్ల నియామకం ఖాళీల భర్తీకి ప్రాధాన్యత. పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం మరియు నిధులు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణ, నాణ్యత నిర్వహణ.

డిజిటల్ విద్య:
డిజిటల్ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత. ఆన్‌లైన్ విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు మరియు అభివృద్ధి.



Leave a Comment