Tirupati Laddu Row :తిరుమల లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? ఏ అంశాలపై దృష్టి పెట్టింది?

Written by admin

Updated on:

Tirupati Laddu Row : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తిరుమ‌ల ల‌డ్డూ వివాదం హాట్ టాఫిక్‌గా మారిన సంగ‌తి మనందరికీ తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై న్యాయస్థానం చేసిన కామెంట్స్‌తో అధికార-విపక్షం మధ్య పొలిటికల్ వెదర్ తారాస్థాయికి చేరింది.

ల‌డ్డూ వివాదంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరో వైపు సుప్రీం కోర్టులో ల‌డ్డూ వివాదంపై పిటిష‌న్ లు సైతం దాఖ‌లు అయ్యాయి. కాగా, ల‌డ్డూ వివాదంపై జ‌న‌సేన జాతీయ కార్య‌ద‌ర్శి నాగ‌బాబు కీల‌కవ్యాఖ్య‌లు చేశారు.

Tirupati Laddu Row – సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఫైర్

Tirupati Laddu row - Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan – Tirupati Laddu Row

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌ని తాను స‌మ‌ర్థిస్తున్న‌ట్లు నాగబాబు చెప్పారు.ఇకపోతే తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహణ్యస్వామి తరపు న్యాయవాది చేసిన ఆర్గ్యుమెంట్‌పై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది.

లడ్డూ వ్యవహారం ముగిసిపోలేదని, వైసీపీకి కష్టాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ నపుణులు. కేవలం సీఎంచంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌పై న్యాయస్థానం మాట్లాడినట్టు చెబుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ లేవనెత్తిన అంశాలపైన సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ వ్యవహారంపై గతరాత్రి టీవీ ఛానెళ్లలో డిబేట్లు పెట్టారు. ఇందులో రాజకీయ నేతలు, విశ్లేషకులు, న్యాయ నిపుణులు సైతం పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు ప్రస్తావించారు. లడ్డూ( Tirupati Laddu Row ) వ్యవహారంపై వైసీపీ నేతలకు టెన్షన్ ఇంకా ఉందని కంక్లూజన్‌లో చెప్పుకొచ్చారు.

వైసీపీ అధికార గెజిట్ తాటికాయంత అక్షరాలతోటి హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ రాసుకొచ్చింది. ‘ఎలాంటి ఆధారాల్లేవు’ అంటూ పేర్కొంది. సిట్ విచారణ ఆపమని న్యాయస్థానం ఎక్కడా ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌‌తో సిట్ ప్రభావితం అవుతుందనేది అసలు పాయింట్.

తమ విశ్వాసాలకు ముడిపడిన అంశం కావడంతో సిట్ విచారణ కాకపోయినా, సీబీఐ లేదంటే జ్యుడీషియల్ విచారణ అయినా జరిపించే ఛాన్స్ ఉందని అన్నారు కొందరు న్యాయ నిపుణులు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రధానికి రాసిన లేఖలో సీబీఐ, జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఎక్కడాకూడా ప్రస్తావించలేదు.

ఇక ఇదే క్రమంలో దర్యాప్తుకు వైసీపీ నేతలు భయపడుతున్నట్లేనని కొందరి వాదన. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయేప్రభుత్వాలు ఉండటంతో సీబీఐ విచారణకి అంగీకరించరని అంటున్నారు. లేదంటే జ్యుడీషియల్ విచారణకు వెళ్లే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. జూన్‌లో టీటీడీకి కొత్త ఈవో వచ్చారు.

అక్కడి సిబ్బంది ఫిర్యాదు మేరకు కొత్తగా వచ్చినటువంటి ఈవో విజిలెన్స్ విచారణ చేపట్టారు. లడ్డూ( Tirupati Laddu Row ) విషయంలో అనుమానాలు లేవనెత్తింది. దీంతో నెయ్యిని ల్యాబ్‌కు తరలించి పరీక్షలు నిర్వహించింది. అందులో వచ్చిన రిపోర్టుపై సీఎం నోరు విప్పారు. ఆ తర్వాత ప్రత్యేకంగా సిట్ విచారణకు ఆదేశించింది.

అసలు ఇంతకీ లడ్డూపై కెమికల్ ఇంజనీర్లు ఏమంటున్నారు..? అంటే, తిరుమల నెయ్యిలో కల్తీ అనేది జరిగింది నిజమని అంటున్నారు కెమికల్ ఇంజనీర్ల నిపుణులు. అవును.. వెన్న నుంచి తీసినటువంటి నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుందంటున్నారు. ఎన్‌డీబీబీ రిపోర్టులో నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ లేదని తేల్చింది.

వెన్న నుంచి నెయ్యి తీయలేదని ఇక్కడ అర్థమైంది. లారిక్ యాసిడ్ 12% కనిపించింది. ఈ తరహా యాసిడ్ కొబ్బరి నూనెలో ఉంటుంది. కొబ్బరి.. జంతువులకి పెట్టినా అది కేవలం నాలగు,ఐదు శాతం మాత్రమే వస్తుందంటున్నారు. లారిక్ యాసిడ్ మార్కెట్లో తక్కువ రేటుకి వస్తుందని అంటున్నారు.

రిపోర్టులో కోకోనట్ లేదా పామ్ కెర్నిల్ కలిసి ఉంటుందని ప్రస్తావించింది. బ్యూట్రిక్ యాసిడ్ లేకపోవటంతో కల్తీ జరిగింది అన్నది కెమికల్ నిపుణుల మాట. మాములుగా డెయిరీల్లో పచ్చిపాల నుంచి తీసే ఆవు నెయ్యిలో పాల్మిటిక్ యాసిడ్ 22 నుంచి 25% మాత్రమే ఉంటుంది. రిపోర్ట్‌లో 40% ఉందని తేలింది.

ఇక్కడ కూడా కల్తీ జరిగిందని అంటున్నారు. పాల్మిటిక్ యాసిడ్ 40% రావాలంటే పామ్ ఆయిల్ లేదా జంతువుల ఫ్యాట్ కలిపితే వస్తుందని రిపోర్టు చెబుతోంది. పాల్మిటిక్ యాసిడ్ 40శాతం రావడానికి ఏఆర్ డెయిరీ ఏం వాడిందనేది సిట్ అధికారులు తేల్చితే ఈ విషయం తేలిపోతుంది.

పామ్ ఆయిల్ ధర.. పందికొవ్వు కంటే ఎక్కువగా ఉంటుందనేసి చెబుతున్నారు. పాల్మిటిక్ యాసిడ్ కోసం పాం ఆయిల్ వాడారా? జంతువుల కొవ్వు వాడారా? అనేది తేలనుంది. 40% పాల్మిటిక్ యాసిడ్ సోర్స్ ఏంటి? అన్నది తెలిస్తే.. నెయ్యి గుట్టురట్టు కానుందని నిపుణుల చెబుతున్న మాట. ఇక ఇదిలా ఉంటే.. తిరుమల వివాదంలో సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? ఏ అంశాలపై దృష్టి పెట్టింది? అనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం.

గత ప్రభుత్వ హయాంలో పరమపవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అవకతవకల్లో నెయ్యి కల్తీ వాడినట్టు.. అందులో జంతువుల కొవ్వు, ఫిష్ నూనె, కూరగాయల నూనె కలగలిసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత పెను దుమారం రేగింది.

రోజుకొక కొత్త అంశం అనేది బయటకి రావటంతో దేశవ్యాప్తంగా ఇదే బర్నింగ్ ఈష్యుగా మారిపోయింది. దీంతో టీటీడీ చెప్పే విషయాలకు వైసీపీ నుంచి ఎదురుదాడి స్టార్ట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

మరి ఈక్రమంలో సిట్ పని తీరు ఎలా ఉందంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐజీ స్థాయి అధికారితో మొత్తం 9మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న సభ్యులు తిరుమల, తిరుపతిలో గతంలో పని చేసినవారే అధికంగా ఉన్నారు. సిట్ బృందంని సభ్యులు సైతం గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినవారే కావడం ఇంట్రస్టింగ్ టాపిక్.

అయితే సిట్ బృందం 3రోజులుపాటు పర్యటించింది. ఇంకా ఎన్ని రోజులుపాటు కొనసాగుతుందో చెప్పలేము. సిట్ బృందం మొదట సమావేశమై మూడుబృందాలుగా విడిపోయారు. ఇద్దరు ఎస్పీలు, ఐజీ మూడుబృందాలు చేయాల్సిన పనితీరు గురించి చర్చించుకున్నారు. ఎక్కడ నుంచి పని ప్రారంభించాలి.. ఎక్కడ విచారణ చేయాలి.. ఏ రికార్డులు పరిశీలిస్తే నిజాలు బయటపడుతాయి.. అని ఒక డెసిషన్ కి వచ్చారు.

ఇక టీటీడీ పాలకమండలి, అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే..? టీటీడీలో గతప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలుకి సంబంధించి అన్ని డీటెయిల్స్ సిట్ బృందం తీసుకుంది. అసలు నెయ్యి టెండర్లు వేసిన వ్యక్తులు ఎవరు? ఎంత మేర క్వాలిటీ ఉంది? ఆ రిపోర్టులు ఉన్నాయా ? చివరి టెండర్లు ఎప్పుడూ జరిగాయి? ఎంత ధరకు సరఫరా చేస్తామని అన్నారు? తక్కువధర అంటే క్వాలిటీ పరిస్థితి ఏంటి? ఇలా అనేక విషయలను ఇప్పటికే టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళి కృష్ణను సిట్ బృందం అడిగి వివరాలు తెలుసుకుంది.

తక్కువ ధరకు వస్తున్నా కూడా టీటీడీ గత పాలకమండలి సభ్యులు, పర్చేజింగ్‌ కమిటీ సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో వీరు పాత్ర ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీటీడీ అధికారుల విషయం కూడా చర్చించినట్లు సమాచారం. క్వాలిటీ లేదని తెలిసి ఎందుకు ప్రశ్నించలేదు? కనీసం రికార్డులో అయిన దానిని నమోదు చేసారా లేదా? ఈ విషయాన్ని( Tirupati Laddu Row ) అప్పటి టీటీడీ ఈవో అలాగే ధర్మకర్తల మండలి దృష్టికి అసలు తీసుకెళ్ళారా? లేదా? అనేది కూడా కూపీ లాగుతున్నారు.

తిరుమల తిరుపతిలోని లడ్డూకు( Tirupati Laddu Row ) సంబంధించిన వివరాలు తీసుకునేందుకు పలు విభాగాలను పరిశీలన చేసే అవకాశముంది. ఇకపోతే తిరుమలకు టెండర్ తీసుకున్న తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రెండురోజులు వ్యవధిలో రెండు ట్యాంకుల నెయ్యి వచ్చినట్లు గుర్తించారు.

Tirupati Laddu Row

అయితే రెండు ట్యాంకులకు వేర్వేరు పేర్లున్నాయి. అంతేకాకుండా మరో రెండుట్యాంకులు సైతం అలాగే రావడం.. రెండుసార్లు వచ్చిన ట్యాంకులకు ఒకే నెంబర్ ఉండడాన్నీ టీటీడీ మార్కెటింగ్ శాఖ గుర్తించింది. ఇదే అంశాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆ ట్యాంకులు ఎవరివి? ఎందుకు ఒకే నెంబర్ తో వచ్చాయి? నెయ్యి సరఫరాదారులు అంతా సిండికేట్ అయ్యారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, త్వరలో సిట్ బృందం తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సైతం పరిశీలన చేయనుంది. అయితే టీటీడీ తెలిపిన విధంగా అన్ని సంస్థలు క్వాలిటీ లేకుండా సరఫరా చేస్తుంటే వారిని హెచ్చరించామని ఈవో ప్రకటించగా మార్పు చేసుకున్నట్లు తెలిపారు.

అయితే మిగిలినవారిని విడిచిపెట్టనట్టేనా? వారిది తప్పు ఉందా? లేదా? అనేది తేల్చాల్సిన పని లేదా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో ఏపీలో తిరుమల లడ్డు( Tirupati Laddu Row ) వివాదం పీక్స్ కు చేరిందనేది క్లియర్ కట్ మనకు అర్ధమవుతోంది. అయితే లడ్డు వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను సైతం ఏర్పాటు చేసింది.

మరోవైపు చూసుకుంటే సుప్రీంకోర్టులో కూడా లడ్డు( Tirupati Laddu Row ) వివాదంపై పలు పిటిషన్లు సైతం దాఖలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అంశంపై దేశంలో పెను దుమారం కొనసాగుతోన్న వేళ.. తాజాగా, లడ్డువివాదంపై జనసేన నేత నాగబాబు మరోసారి స్పందించారు. ఇటీవల లడ్డు( Tirupati Laddu Row ) వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/prakashraaj/status/1840696381205299576

ఈ నేపథ్యంలో కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సపోర్ట్ గా నిలుస్తుండగా.. వైసీపీతో పాటు, ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డు( Tirupati Laddu Row ) వివాదంపై తాజాగా నాగబాబు స్పందించారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారన్నారు.

పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. అదేవిధంగా డిక్లరేషన్ పై వైసీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని.. కేవలం ఒక సంతకం పెడితే వచ్చే నష్టమేముందన్నారు.

ఇకపోతే జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నాగాబాబు డిమాండ్ చేశారు. లడ్డు వివాదం వెనుక ఎంతటి వారున్న కూడా సిట్ దర్యాప్తులో బయటపడతారని ఆయన అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు.



Leave a Comment