Dasara 2024: చెడుపై మంచి విజయం: దసరా పండుగ విశిష్టత.. చరిత్ర ప్రకారం దసరా పండుగకు ప్రాచుర్యంలో ఉన్న కథలు ఎన్ని..?

Written by admin

Updated on:

Dasara 2024: దసరా.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటుఆ జగన్మాత దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ.. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు.

పదవ రోజు విజయదశమి( Dasara 2024 ). శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి ఆ తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి ఆ తరువాత వచ్చే మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు చేయడం జరుగుతుంది. దసరాలోనూ బొమ్మలకొలువులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. మైసూరు, కలకత్తా, ఒడిశాలలో దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏపీలోని అమ్మవార్ల ఆలయాల్లో రోజుకొక అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి అట్టహాసంగా పూజలు చేస్తారు.

ఈ దేవికి దసరా( Dasara 2024 ) వెళ్ళిన తర్వాత మొదటి మంగళవారం రోజు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి ఆలయం ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుంచి కోట వరకు మూడు సార్లు ఊరేగించడం జరుగుతుంది. అక్కడ గజపతుల వారసులు అమ్మవారికి పెద్దఎత్తున లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుంచి ఏనుగు సంబరాలు జరపడం అక్కడి ఆచారం. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు.

ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్ఠలను ఆచరిస్తాడు. మొదటి రోజు నుండి వంద సంవత్సరాల క్రితం వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసినటువంటి ఏనుగుని నూతనంగా అంబారీతో చక్కగా అలంకరిస్తారు. తెల్లటి వస్త్రానికి రంగుల లతలు, కాగితం పూలు, తగరంతో అందంగా అలంకరణలు చేసి అంబారీ చేస్తారు.

తెలంగాణ విషయానికొస్తే.. వినాయక చవితికి వినాయకుడిని ప్రతిష్టించినట్లు దసరాకి అమ్మవార్ల విగ్రహాల్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. పండుగ అనంతరం వాటిని నిమజ్జనం చేస్తారు.

ఇక్కడ మరొక విశేషం ఏంటంటే.. దసరాతో( Dasara 2024 ) పాటుగా బతుకమ్మను కూడా జరుపుకుంటారు. అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. ఆఖరి రోజున బతుకమ్మలని చెరువులు, నదులలో నిమజ్జనం చేయడం జరుగుతుంది.

Dussehra 2024 – దసరా ఎందుకు జరుపుకుంటారు..?

Dasara 2024

దసరా అనగానే చాలామందికి పెద్ద సంబరం. మరి దసరా ఎందుకు జరుపుకుంటారు ? ఏ సందర్భంగా ఈ పండుగ వచ్చింది ? దాని విశిష్టత ఏంటి ? ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం దసరా పండుగకు మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి రాముడు రావణుడిపై గెలవడంతో దసరా రోజున రావణ దహనం చేస్తారు రోజున రావణ దహనం చేస్తారు.

రెండవది పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. మూడోవది.. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటారు.

అందుకే దసరా పండుగ రోజున రావణ కాష్ట నిర్వహణ, అలాగే జమ్మి చెట్టుకు పూజ చేయడం, రాక్షస వధ వంటి నాటకాలు వేయడం అనాదిగా వస్తున్న ఆచారాలుగా ఉన్నాయి. విజయదశమి రోజున వాహన, ఆయుధ పూజ నిర్వహిస్తారు. అదేరోజున అమ్మవారి వద్ద జమ్మి పూజ చేస్తారు. మరి ఇప్పుడు మనం చరిత్ర ప్రకారం దసరా పండుగకు ప్రాచుర్యంలో ఉన్న మూడు కథలు గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం…..

Dasara 2024 – దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు…? రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు…?

Dasara 2024
Raavanasura – Dasara 2024

దసరా( Dasara 2024 ) పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా నాడు రావణాసురుడి యొక్క దిష్టి బొమ్మని తగులబెట్టడానికి మన చరిత్ర మరియు పురాణాల ప్రకారం గనుక ఓసారి పరిశీలిస్తే, శ్రీరాముడి పాలనా కాలం నుండే ఈ విజయదశమిని విజయ ప్రస్థానంగా ఆచరణలోకి తీసుకోవడం జరిగింది. 

శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి యుద్దనికి వెళ్లాడట, వెళ్లి రావణాసురుడు పై విజయం సాధించాడట. చెడుపై మంచి గెలుపు సూచికగా ఈ విజయదశమి( Dasara 2024 ) రోజున ప్రజలంతా కలిసి రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది.

మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గామాతను ఎంతో భక్తి శ్రద్ధలతో స్మరించి రావణ సంహారం చేయగా దేవతలంత ఆనందభరితులై దేవీ పూజ చేసారు. నాటి నుండి ఇప్పటి వరకు అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గా దేవీ నవరాత్రుల్ని ఎంతో ఘనంగా నిర్వహించి పదవ రోజున విజయదశమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

రాముడు రావణుని మీదకు యుద్దానికి వెళ్లిన రోజు విజయదశమి( Dasara 2024 ) అని వేద పండితులు చెబుతుంటారు. విజయదశమి రోజున రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే, రోజు రోజుకీ ఆడవారిపై అత్యాచారాలు పెరగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా, సోదరిల, పూజించాలని, లేకపోతే రావణుడిలాగా ఏదో ఒక రోజు వారి పాపం పండి దహించుకుపోతారని అందుకే మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని ఈ యొక్క  రావణ దహనం సందేశం ఇస్తుంది.

అందుకు దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు. చెడుపై కొంత ఆలస్యమైనా  మంచి ఎప్పుడైన జయీస్తుంది అనే సూచకంగా దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు. దుర్గా దేవి, మహిషాసురుడితో యుద్ధం చేసి వధించి విజయం, జమ్మి చెట్టుపై పాండవులు ఆయుధాలను తిరిగి తీసిన రోజే దసరా

చెడు మీద మంచిని సాధించిన సందర్భంగా అందుకు ఆ యొక్క విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తుంటారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు.

దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున మన చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ యొక్క ఆయుధాలని తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయడం ఆచారంగా వస్తోంది.

జగన్మాత అయినటువంటి దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతడ్ని వధించి విజయాన్ని పొందిన శుభ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు.

బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల వల్ల వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా మహిషాసురుడిపై వారిలో రగిలినటువంటి క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

శివుని యొక్క తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనిమిది చేతుల్ని కలిగి ఉంటుంది. ఆమెకు శివుడు శూలముని, విష్ణువు చక్రముని, ఇంద్రుడు వజ్రాయుధముని, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహముని వాహనంగాను ఇవ్వడం జరుగుతుంది.

ఇలా సర్వదేవతల యొక్క ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుడిని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చినటువంటి ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది. 

ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషుని సంహరించిన రోజు దసరా పర్వదినంగా పిలవబడుతోంది. అదే విజయదశమి కూడా. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతుంటారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ యొక్క ఆయుధాలను శమీ చెట్టు పైన పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. 



Leave a Comment