Prabhas Birthday Special: మాస్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, పౌరాణికం ఇలా ఎటువంటి జానరైనా కూడా అలవోకగా నటించి ఆడియన్స్ ని మెప్పిస్తారు రెబల్‌స్టార్ ప్రభాస్. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ వద్ద దుసుకెళ్లారు.
అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన క్రేజ్‌తో ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యారు. నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు( Prabhas Birthday Special ). కాబట్టి, మన డార్లింగ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం…
Prabhas Birthday Special – Interesting Facts About Prabhas
1.ప్రభాస్ నటించిన మొదటి సినిమా పేరు ‘ఈశ్వర్’. 2002లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయనే చెప్పాలి.
2.’యాక్షన్ జాక్సన్’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో మెరిశారు ప్రభాస్( Prabhas Birthday Special ). ఆ తర్వాత దేనికైనా రెడీ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు.
3.తన సినీ కెరీర్‌లో ప్రభాస్ పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అందులో నంది ఉత్తమ నటుడు (మిర్చి), సైమా ఉత్తమ నటుడు (బాహుబలి 2) ఉండటం విశేషం.
4.ప్రభాస్‌తో మూడుసార్లు నటించిన హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష (వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి), అనుష్క (బిల్లా, మిర్చి, బాహుబలి) ఉన్నారు. అలాగే ఆయన రాజమౌళి (ఛత్రపతి, బాహుబలి) పూరి జగన్నాథ్‌తో (బుజ్జిగాడు, ఏక్ నిరంజన్) రెండుసార్లు వర్క్ చేశారు.
5.డార్లింగ్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి మూడు చిత్రాల్లో నటించారు. అందులో ‘బిల్లా’, ‘రెబల్’లో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కనిపించగా, ‘రాధే శ్వామ్’లో మాత్రం కృష్ణం రాజు అతిథి పాత్రలో కనిపించారు.
6.ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి: ది కన్‌క్లూజన్ రికార్డుకెక్కింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా ఇదే కావడం విశేషం
7.’ఆదిపురుష్’లో రాముడిగా ఇతిహాసగాథలో కనిపించిన ప్రభాస్, కల్కి (కర్ణ), కన్నప్ప (నంది!) లాంటి పౌరాణిక రంగంలోనూ మెరిశారు.
8.స్టార్‌డమ్ సొంతం చేసుకున్నా కూడా ప్రభాస్ యాడ్స్‌కు దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.
9.ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.
10.నటుడు కాకుంటే హోటల్ నడపాలని అనుకున్నట్లు ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పారు.
ఇప్పటి వరకు మనం డార్లింగ్ ప్రభాస్( Prabhas Birthday Special ) గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా… ఇక ఇప్పుడు ప్రభాస్ నటించినటువంటి 23 సినిమాల యొక్క కలెక్షన్స్ డీటెయిల్స్ పై ఒక లుక్కేద్దాం రండి…
ఈశ్వర్
ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రాన్ని జయంత్.సి.పరాన్జీ డైరెక్ట్ చేశారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె.అశోక్ కుమార్ ఈ మూవీని నిర్మించడం జరిగింది. అప్పట్లో 2002 టైంలో కోటిన్నర బడ్జెట్ లో తీసిన చిత్రమిది. చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. 3కేంద్రాల్లో 100రోజులు ఆడింది ఈ చిత్రం.
రాఘవేంద్ర
ప్రభాస్( Prabhas Birthday Special ) హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ‘శ్రీ శ్రీ చిత్ర’ బ్యానర్ పై బి.శ్రీనివాస రాజు నిర్మించారు. రూ.4కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2.7కోట్ల వరకు మాత్రమే షేర్ ను రాబట్టింది.
వర్షం
ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకుడు. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై యం.యస్.రాజు నిర్మించారు. 2004లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.6కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం ఫుల్ రన్ లో ఏకంగా రూ.19.2కోట్ల షేర్ ను రాబట్టింది.
అడవి రాముడు
ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. ‘ఫ్రెండ్లీ మూవీస్’ బ్యానర్ పై చంటి అడ్డాల ఈచిత్రాన్ని నిర్మించారు. 2004లో రిలీజైన ఈసినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. రూ.8కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం కేవలం రూ.5కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
చక్రం
ప్రభాస్ హీరోగా( Prabhas Birthday Special ) ఆసిన్, ఛార్మి హీరోయిన్లుగా రూపొందిన ఈచిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. 2005లో రిలీజైన ఈసినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. రూ.9కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5.7కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఛత్రపతి
ప్రభాస్, శ్రీయ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. రూ.10.2కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినటువంటి ఈమూవీ బాక్సాఫీస్ వద్ద రూ.16.35కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
పౌర్ణమి
2006లో ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రానికి యం.యస్.రాజు నిర్మాత. సూపర్ హిట్ కాంబో కావడంతో ఈసినిమాకు రూ.12కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్ లో ఈ మూవీ కేవలం 6.7కోట్ల రూపాయల షేర్ ని మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
యోగి
ప్రభాస్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు. 2007లో రూ.15కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. ఇది ఒక అండర్ రేటెడ్ కమర్షియల్ హిట్ మూవీ అని చెప్పాలి.
మున్నా
ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. రూ.15కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినటువంటి ఈమూవీ బాక్సాఫీస్ వద్ద రూ.13కోట్ల వరకు షేర్ ని రాబట్టింది.
బుజ్జిగాడు
ప్రభాస్ హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం రూ.19కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.15కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
బిల్లా
ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం రూ.22కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.19కోట్ల షేర్ ను రాబట్టింది.
ఏక్ నిరంజన్
ప్రభాస్ హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం రూ.20కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద 12.8కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టింది.
డార్లింగ్
ప్రభాస్–కరుణాకరణ్ డైరెక్షన్ లో రూపొందిన ఈమూవీ రూ.16.8కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. బాక్సాఫీస్ వద్ద రూ.22.91కోట్ల షేర్ ని రాబట్టింది.
మిస్టర్ పర్ఫెక్ట్
ప్రభాస్–దశరథ్ కాంబినేషన్లో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ఫుల్ రన్ లో ఈమూవీ 27.92కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.
రెబల్
ప్రభాస్–లారెన్స్ కాంబినేషన్లో వచ్చిన ఈచిత్రం రూ.33కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.27.3కోట్ల షేర్ ను రాబట్టింది.
మిర్చి
ప్రభాస్–కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. రూ.30కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో రూ.47.88కోట్ల షేర్ ను రాబట్టింది.
బాహుబలి (ది బిగినింగ్)
రూ.148కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్ గా రూ.302.3కోట్ల షేర్ ను రాబట్టింది.
బాహుబలి 2
రూ.350కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.814.10కోట్ల షేర్ ను రాబట్టింది.
సాహో
రూ.290కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం ఫుల్ రన్లో రూ.232.60కోట్ల షేర్ ను రాబట్టింది.
రాధే శ్యామ్
రూ.200కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం ఫుల్ రన్లో రూ.86.41కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఆదిపురుష్
రూ.230కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం ఫుల్ రన్ లో రూ.196.58కోట్ల షేర్ ను రాబట్టింది.
సలార్
రూ.338కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈచిత్రం ఫుల్ రన్లో రూ.326.05కోట్ల షేర్ ను రాబట్టింది.
కల్కి 2898 AD
రూ.385కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ.530.62కోట్ల షేర్ ను రాబట్టింది.
Prabhas Birthday Special – RajaSaab Motion Poster
ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే( Prabhas Birthday Special ) సందర్భంగా ఆయన అప్‌కమింగ్ మూవీ ‘ది రాజా సాబ్’ మేకర్స్, అభిమానుల కోసం ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్.
వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈమూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే ప్రెజెంట్ తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతోన్నారు ప్రభాస్( Prabhas Birthday Special ). రాజాసాబ్‌తో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడికల్ లవ్ స్టోరీ, సందీప్ వంగాతో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నారు.
వీటితో పాటే కల్కి, సలార్ సీక్వెల్‌లలోనూ ప్రభాస్( Prabhas Birthday Special ) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటుగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ ఎలా వచ్చింది..? ఆ రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి..