Konda Surekha: సినీ ఇండస్ట్రీనా మజాకా.. వెనక్కి తగ్గిన కొండా సురేఖ.. ఇక వదిలేయండి అంటూ రిక్వెస్ట్..!

Written by Sandeep

Updated on:

Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై విమర్శలు చేసే క్రమంలో సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పేర్లను తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. ఈక్రమంలో నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి తీరును తప్పు పట్టారు.

https://twitter.com/TeamSurekha/status/1841738939201188057

దాంతో కొండా సురేఖ( Konda Surekha ) వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే…

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి కొన్ని అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు.

హీరోయిన్ల ఫోన్స్ ట్యాప్ చేసి, వారికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితాలను నాశనం చేశాడని, హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ ఆరోపించారు.

కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ ఆరోపణలు

రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్, సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున, నాగచైతన్య, సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని దీనికి సమంతా అంగీకరించకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇవ్వడం జరిగిందని మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖ రాజీనామాకు పెద్దఎత్తున డిమాండ్

ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ( Konda Surekha ) మంత్రి పదవికి అనర్హురాలని పెద్దఎత్తున ఆమె తీరు పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సురేఖ తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మన రాజకీయాలని ఎటువైపు తీసుకు వెళుతుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్

రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి సైతం మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత ఫ్యాన్స్ కొండా సురేఖను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

దసరాకు ముందే మంత్రి వర్గ విస్తరణ

కొండ సురేఖ( Konda Surekha ) తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ప్రెజెంట్ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న టైంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.

కొండా సురేఖకు పదవీ గండం

ఇక ఇదే టైంలో కొండా సురేఖ( Konda Surekha ) పట్ల ఒక్కసారిగా వ్యక్తం అవుతున్న వ్యతిరేకత, నిరసనలు ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరు పైన అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీలో కూడా ఆమె వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు.. పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.

Konda Surekha – సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన..?

ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగిస్తారని చర్చించుకుంటున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండ సురేఖకు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

మరోవైపు కొండ సురేఖ వ్యాఖ్యల పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? సురేఖ( Konda Surekha ) మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఇక్కడి వరకు మనం చూసుకుంటే ఆమె రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల రియాక్షన్ ఇది..!

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అటు సినీ పరిశ్రమ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. నాగార్జున, నాగచైతన్య, సమంత, చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

ఈక్రమంలో నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా స్పందించగా.. పరస్పర అంగీకారంతో తాను సమంతతో విడిపోయానని, ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని మీడియా హెడ్‌ లైన్స్ కోసం ఉపయోగించుకుంటోందని నాగ చైతన్య ఫైర్ అయ్యారు.

సమంత కూడా ఆ కాసేటికే రియాక్ట్ అయ్యింది. విడాకులు తన వ్యక్తిగత విషయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. తన పేరును రాజకీయాల కోసం వాడుకోవద్దని ఆమె హితవు పలికారు. తనను చిన్న చూపు చూడొద్దని.. తానెప్పుడూ పాలిటిక్స్ కి దూరంగానే ఉంటానని సామ్ స్పష్టం చేశారు.

ఇక కొండా సురేఖ( Konda Surekha ) వ్యాఖ్యలపై స్వయంగా నాగచైతన్య తండ్రి, అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సైతం స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్ధులని విమర్శించడానికి వాడొద్దని నాగ్ హితవు పలికారు. తమ కుటుంబం పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని నాగ్ డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయం అన్నారు. మంత్రిగా మీరు హుందాగా, గౌరవంగా ఉండాలని ఎన్టీఆర్ సూచించారు.

చిత్ర పరిశ్రమపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్న ఆయన.. బయటి వ్యక్తులు తమపై ఇలాంటి ప్రకటనలు చేస్తే చూస్తూ కూర్చొమని జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరించారు. హద్దులు దాటకుండా ఒకొరినొకరు గౌరవించుకునేలా ప్రవర్తన ఉండాలన్నారు.

https://twitter.com/KChiruTweets/status/1841684462767313169

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారంపై స్పందించారు. మీడియాలో నిలిచేందుకు సినీ నటులను సాఫ్ట్‌గా టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఉన్నత పదవుల్లో ఉన్న వారు తమ స్థాయిని దిగజార్చుకోకూడదని మెగాస్టార్ చిరంజీవి హితవు పలికారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

https://twitter.com/alluarjun/status/1841692652388970952

సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధంగా.. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యలను అనుమతించకూడదని ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

రాజకీయ పార్టీలు, నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. మహిళల వ్యక్తిగత విషయాల్ని గోప్యంగా ఉంచాలని బన్నీ సూచించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయంపై సినీ ప్రముఖుల ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొండా సురేఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేఏ పాల్

KA Paul about Konda Surekha’s Comments on TFI

ఈవిధంగా సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) చేసిన కామెంట్స్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోను.. అటు రాజకీయంగాను తీవ్ర దుమారం రేపుతున్నాయి. దాంతో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు. అయితే ఈ మంట ఇంకా చల్లరడం లేదు.

తాజాగా మంత్రి వ్యాఖ్యలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హైరేంజ్ లో విరుచుకుపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వింటే మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ మాటలు చట్టవిరుద్ధమని.. ఇదే అమెరికా ఐతే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని కేఏ పాల్ అన్నారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా..? అని ప్రశ్నించారు.

కొండా సురేఖకు 72 గంటల టైమ్ ఇస్తున్నానని.. ఆలోపు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ 72 గంటల సమయంలో రాజీనామా చేయకపోతే కొండా సురేఖపై కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. హైడ్రాతో వ్యతిరేకత వస్తుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేయించారేమోనని కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేశారు. 

కొండా సురేఖ వెనక్కి తగ్గారు..ఇక వదిలేయండి ప్లీజ్.. సినీ ప్రముఖులకి TPCC రిక్వెస్ట్

ఈ విధంగా నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అవుతున్నారు.

https://twitter.com/prakashraaj/status/1841424363284840958

ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో.. ఆమె క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు ఇక్కడితో ఎండ్ కార్డు వేయాలని ఇండస్ట్రీకి సూచించారు.



Leave a Comment