Israel Iran War: ఇజ్రాయేల్ అనుకున్నంత పని చేసింది. ఈ అక్టోబర్ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్‌పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని 10 ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 6 నెలల వ్యవధిలో ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడి( Israel Iran War ) చేయటం ఇది రెండోసారి.
అక్టోబరు 1న ఇజ్రాయేల్‌పై 200కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా కూడా సైరన్లు మోగించి ప్రజల్ని అప్రమత్తం చేసింది.
ఇజ్రాయెల్‌కు చెందినటువంటి మూడు సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ని చదవాల్సిందే…!
ఇజ్రాయెల్ సైన్యం క్రూరత్వానికి హద్దే లేకుండా పోతోంది. గాజాతో పాటు లెబనాన్ గడ్డపై రక్తపాతాన్ని సృష్టిస్తోంది. ఓ రోజు గాజాపై దాడులు చేస్తే మరో రోజు లెబనాన్ నేలపై నెత్తుటి దాహాన్ని తీర్చుకుంటుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్‌పై యుద్ధానికి( Israel Iran War ) రెడీగా ఉండాలని ఆ దేశ పెద్దలు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ న్యూ యార్క్ టైమ్స్ నివేదించింది. దక్షిణ లెబనాన్‌లోని హస్‌బాయాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ కెమెరామెన్ చనిపోయారని ఇరాన్ అనుకూల బ్రాడ్‌కాస్టర్ అల్-మయాదీన్ రిపోర్ట్ చేసింది.
మరో ఇద్దరు జర్నలిస్టులు కన్నుమూశారని లెబనాన్ రాష్ట్ర వార్తా సంస్థ చెబుతోంది. అక్టోబర్ 7, 2023 తరువాత గాజా గడ్డపై 140 మంది జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో కన్నుమూశారు. అనేకమంది గాయపడ్డారు. మరి కొంతమంది కనిపించకుండా పోయారు. మరోవైపు నవంబర్ 5వతేదీ లోపే దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచానికి మన పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఐతే అదే లెవల్‌లో కౌంటర్ ఇచ్చేందుకుగాను ఇరాన్ కూడా రెడీగా ఉంది.
ఇంతకీ ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తోంది? ఇరాన్ మీద ఎలాంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది? పశ్చిమాసియాలో రక్తపాతం తప్పదా? ఇరాన్ తో కంపేర్ చేస్తే సైనికుల విషయంలో ఇజ్రాయెల్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. జనాభా పరంగా చిన్న దేశమైనా సైన్యం పరంగా చాలా ఎత్తులో ఉంది.
రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు, అలాగే అడ్వాన్స్‌డ్ రిజర్వ్ ఫోర్స్‌లు, మొసాద్ లాంటి నిఘా వ్యవస్థ, పైగా అమెరికా లాంటి మిత్ర దేశాల మద్దతు.. అన్నీ కలిసి ఇజ్రాయెల్ సైన్యాన్ని చాలా బలంగా మార్చాయి. అయితే ఇరాన్ వైపు చైనా, రష్యా మద్దతుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సవాల్ విసురుతూ ఇరాన్ తన మిత్రులు, మిలీషియా దళాలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ వివిధ స్థాయిల్లో ఇరాన్ మద్దతు ఇస్తుంటుంది. ఇరాన్ సపోర్ట్ ఉన్న అత్యంత శక్తిమంతమైనటువంటి సాయుధ గ్రూపుల్లో లెబనాన్‌లోని హిజ్బొల్లా గ్రూపు ఒకటి.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి, సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్, హిజ్బొల్లా గ్రూపుల మధ్య కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో హిజ్బుల్లా కీలక నేతలు చనిపోతూనే ఉన్నారు. అయినా కూడా హిజ్బుల్లా వెనక్కి తగ్గడం లేదు. అటు ఇజ్రాయెల్ కూడా బలహీనులపై ప్రతాపం చూపటం ఆపడం అనేది లేదు.
ఇక హమాస్ సహా పాలస్తీనాలోని అనేక సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తోంది. ఇది గాజా యుద్ధం సహా, ఇరాన్, దాని మద్దతు కలిగిన గ్రూపులుకు, ఇజ్రాయెల్ సహా దాని మిత్ర రాజ్యాల మధ్య ఘర్షణలకు కారణమవుతోంది.
అటు ఇరాక్, సిరియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంటుంది. ఇది కూడా ఇజ్రాయెల్‌కు నచ్చదు. ఇలా సుమారుగా ప్రతీ అంశంలోనూ ఇరాన్‌ది ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరే.. అందుకే ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
అసలు.. ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చిచ్చు ఎలా మొదలైంది..?
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి నెలకొంది. గత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య వైరం చాపకింద నీరులా రాజుకుంటూనే ఉంది. ఇరు దేశాల నడుమ జరిగే యుద్ధాన్ని చాలా మంది షాడో వార్ గా అభివర్ణించారు. ఎందుకంటే.. రెండు దేశాలు ఏనాడు తమ వైరాన్ని బహిరంగపరుచుకోలేదు.
కానీ, ఇప్పుడు ముసుగు తొలగిపోయింది. రెండు దేశాలు నేరుగా తలపడుతున్నాయి. తాడో పేడో తేల్చుకుందాం అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఒకప్పుడు మిత్రదేశాలుగా కొనసాగిన ఇరాన్, ఇజ్రాయెల్ నడుమ ఎందుకు వివాదం చెలరేగింది? ముందు తప్పుటడుగులు వేసింది ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
Israel Iran War – హమాస్ దాడులతో పెరిగిన ఉద్రిక్తత
తాజా పరిణామాలకి కారణం హమాస్ 2023 అక్టోబరు 7వతేదీన ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం. హమాస్ మూకలు ఇజ్రాయెల్ లోకి దూసుకొచ్చి ఏకంగా 1200 మంది ఇజ్రాయేలీలను హతమార్చాయి. ఎంతో మందిని బంధించి గాజాకు తీసుకెళ్లాయి. హమాస్ చర్యతో కోపంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహు గాజాపై వైమానిక దాడులు చేయించారు.
బందీలుగా ఉన్న తమ పౌరుల్ని వదిలే వరకు దాడులు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు చేయడం జరిగింది. తన సైన్యం చేత గాజాలో భీకరంగా తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులు చేయించారు. ఈ దాడులు కాస్త ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి కారణాలుగా అయ్యాయి.
గత కొంతకాలంగా లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యానికి హిజ్బుల్లా అనుబంధ సంస్థలు అయినటువంటి మిలీషియాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో వెస్ట్ బ్యాంక్ లోని ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనా నిరసనకారులతో ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద గురిపెట్టింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో దాడులకు దిగింది. హిజ్బుల్లా చీఫ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి షాడో యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసిందని క్లియర్ గా అర్ధమవుతుంది.
తమ దేశం మీద ఇరాన్ దాడి చేసి పెద్ద తప్పు చేసింది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన మూల్యంచెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అటు ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Israel Iran War – మిత్ర దేశాలు, శత్రు దేశాలుగా..!
వాస్తవానికి ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్( Israel Iran War ) మిత్రదేశాలు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. చాలా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించలేదు. మిడిల్ ఈస్ట్ ఉన్న ముస్లీం దేశాలు ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించేవి.
అలాంటి పరిస్థితిలో ఇరాన్, ఇజ్రాయెల్( Israel Iran War ) కు స్నేహ హస్తం అందించింది. ఇరు దేశాల నడుమ మంచి సంబంధాలు కొనసాగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తే, ఇరాన్, ఇజ్రాయెల్ కు ఆయిల్ సరఫరా చేసింది. అన్ని రంగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకున్నాయి.
Israel Iran War- ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ అడుగులు
ఇరాన్ లో అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం మొదలైన తరువాత ఇజ్రాయెల్ తో సంబంధాలు పలుచబడ్డాయి. ఖొమేనీ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ను డెవిల్ దేశాలుగా అభివర్ణించాడు. ఇరాన్ ప్రత్యేక ముస్లిం దేశంగా ఉండాలని ఖొమేనీ ఉద్యమం లేవదీశాడు.
1979లో ఇరాన్ ముస్లిం దేశంగా అవతరించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దారులు వేరయ్యాయి. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలు తెగిపోయాయి. టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చడం జరిగింది. ఇరు దేశాల నడుమ వైరం మొదలయ్యిది.
Israel Iran War – ఇజ్రాయెల్ శత్రువులతో ఇరాన్ దోస్తీ
అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్( Israel Iran War ) శత్రుదేశాలతో జోడీ కట్టింది. సిరియా, యెమెన్, లెబనాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఇరాన్ మిలీషియా దళాలతో ఓ నెట్ వర్క్ ను రూపొందించింది. లెబనాన్‌లోని ఇజ్రాయెల్ వ్యతిరేక హిజ్బొల్లా గ్రూపుతో పాటుగా హమాస్ ఉగ్రమూకలకు ఇరాన్ తన మద్దతు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సిరియా, గాజాలోని ఇరానియన్ స్థావరాలను నేలమట్టం చేసింది. వైమానిక దాడితో తమ అణు శాస్త్రవేత్త మొహసేన్ ఫక్రిజాదేను ఇజ్రాయెల్ ప్రాణాలు తీసినట్లు ఇరాన్ ఆరోపించింది. ఆ తరువాత యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతుగా నిలిచింది.
ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని పలు రకాల మిలిటెంట్ గ్రూపులకి ఇరాన్ ఆయుధాలు అందించడంతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ చర్యల కారణంగా గాజా యుద్ధం, లెబనాన్ యుద్ధం తలెత్తింది. ఇజ్రాయెల్ ప్రతి దాడులకు ఇరాన్ ఎలా తట్టుకుంటుంది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.