AP Weather Report: బంగాళాఖాతం అల్పపీడనం అందరిని భయాందోళనకు గురి చేస్తుంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ఇలా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లా ఇంకా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల వచ్చే 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువు దిశగా దక్షిణకోస్తా , ఉత్తర తమిళనాడు తీరాలా వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సముద్రం మీదకి ఎవరు వేటకు వెళ్లోద్దని వాతావరణ శాఖ( Ap Weather Report ) తెలిపింది. సోమవారం అనగా ఈరోజు ( 14 – 10 – 2024 ) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరి కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది.
మంగళవారం అనగా రేపు ( 15 – 10 – 2024 ) కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా బుధవారం ( 16 – 10 – 2024 ) మరియు గురువారం ( 17 – 10 – 2024 ) వారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా పొంగే వాగులు, కాలువలు, చెరువులు, మ్యాన్ హోల్స్ కి దూరంగా ఉండాలి.
కరెంటు స్థంబాలు, కరెంటు తీగలు, చెట్లు కింద ఉండడం మంచిది కాదు కాబట్టి వీటి కింద అసలు నిలబడకండి. అందరూ చెరువులకు, వాగులకు దెగ్గర లో ఉన్న భావనాలనుండి సురక్షిత ప్రదేశంలోకి చేరుకోవాలి. అతి భారీ వర్షాలతో పటు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి.
అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి. పొలం పని చేసే రైతులు కానీ కూలీలు కానీ మిగితా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం( Ap Weather Report ) ప్రకటించింది. అలానే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరియు కృష్ణ , గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దక్షిణ కోస్తాలో 35 నుండి 45 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు ఆరంజ్ అ*లర్ట్ జారీ చేసారు. అలాగే కడప జిల్లా , చిత్తూరు జిల్లాలకు ఎల్లో అల*ర్ట్ జారీ చేసారు అధికారులు. సముద్రం అలజడిగా మారిన కారణంగా మత్స్య కారులు వేట కోసం సముద్రం మీదకు వెళ్లకూడదని హెచ్చరించారు.
AP Weather Report – భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సెలెవులు పొడిగింపు..!
ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కొన్ని జిల్లాలో విద్యాసంస్థలకు అధికారాలు సెలవు ప్రకటించారు. వర్షాలు తీవ్రతగా ఉంటుందన్న వాతావరణ కేంద్రం( Ap Weather Report ) హెచ్చరించడం వల్ల సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అల్పపీడనం కారణంగా ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం అ*లెర్ట్ అయింది, వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాలకి కీలక ఆదేశాలను జారీ చేసింది. అతి భారీ వర్షాలపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, పలు అధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
చెరువులు , వాగులు , నీటి ప్రదేశాల వద్ద అలర్ట్ గా ఉండి, పర్యవేక్షణ ఉంచాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే రెస్పాండ్ అవ్వాలని ఆదేశించారు.
AP Government Announced Holidays for Schools Due to Heavy Rainfall in AP
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం అంత అ*లర్ట్ అయ్యారు. ఎలాంటి పరిస్తినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నటు తెలుస్తుంది. సముద్ర తీర ప్రాంత మండలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తు ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా నెల్లూరు లోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మరియు ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు కూడా సెలవును ప్రకటించారు. దసరా సందర్భంగా ఇచ్చిన సెలవులు పూర్తవడం తో సోమవారం అనగా ( 14 – 10 – 2024 ) ప్రారంభం అయ్యాయి కానీ వర్షాల కారణంగా 14 మరియు 15 తారీఖున కూడా సెలవును ప్రకటించారు.
వాతావరణ శాఖ( AP Weather Report ) ఇచ్చిన హెచ్చరిక తో మరి కొన్ని రోజులు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ అధికారులకు మరియు ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
Also Read : AP Ministers 2024: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరియు వారి బాధ్యతలు