FLIPKART BIG BILLION DAYS 2024 షురూ.. భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు..!

Written by admin

Updated on:

Flipkart Big Billion Days 2024: రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో ప్రపంచ అగ్రగామి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రకటించింది. దీంతో అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లతో( Flipkart Big Billion Days 2024 ) వినియోగదారులు పండుగ విక్రయాలను చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 26వతేదీ నుండి ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ఈ అవకాశాన్ని ముందుగా వినియోగించుకోగా, సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ 6వతేదీ వరకు అదిరిపోయే ఆఫర్లతో ఈ సేల్( Flipkart Big Billion Days 2024 ) జరగనుంది.

ఇకపోతే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టూవీలర్స్, మొబైల్స్, ల్యాప్ టాప్స్, గృహోపకరణాలు, ఇతర అన్ని రకాలా ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. కాబట్టి, కొత్త ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆఫర్( Flipkart Big Billion Days 2024 ) అని చెప్పవచ్చు. ప్రత్యేకించి హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం…

స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు

Flipkart Big Billion Days 2024

ఐఫోన్లపై ఆఫర్లు

ఆపిల్ ఐఫోన్ 15 అసలు ధర వచ్చేసి రూ.69,900 కాగా, ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా రూ.54,999కే లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు కలిగి ఉన్నవారికి 10% వరకు ఇనిస్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. రూ.999 నుంచే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది.

ఐఫోన్ 15 ప్లస్ అసలు ధర రూ.75,999 కాగా, ఆఫర్ లో రూ.54,999కే పొందొచ్చు. ఇకపోతే ఐఫోన్ 15 ప్రో అసలు ధర రూ.1,09,900 కాగా, రూ.94,999 కే మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ.1,34,900 కాగా, రూ.1,14,999 కే లభిస్తోంది.

శాంసంగ్ గేలాక్సీ ఆఫర్లు

శాంసంగ్ గేలాక్సీ S23 అసలు ధర రూ.55,999 కాగా, ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.36,999 కే అందుబాటులో ఉంది. శాంసంగ్ గేలాక్సీ S24 ప్లస్ అసలు ధర రూ.79,999 కాగా, రూ.64,999కే లభిస్తోంది. వినియోగదారులు రూ.999 చెల్లిస్తే ఈ డీల్స్ ను రిజర్వ్ చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ ఫోన్లు

గూగుల్ పిక్సెల్ 7 ఆఫర్లో రూ.33,999 కే లభిస్తోంది. అలాగే గూగుల్ పిక్సెల్ 7 ప్రో మోడల్ ధర అన్ని డిస్కౌంట్లతో కలిపి రూ.40,999 గా ఉంది. ఇక గూగుల్ పిక్సెల్ 8A పై రూ.10 వేల డిస్కౌంట్ లభిస్తోంది. రూ.39,999 కే ఈ ఫోన్ ను మీరు పొందొచ్చు.

ఇకపోతే గూగుల్ పిక్సెల్ 8పై ఏకంగా రూ.42 వేల డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఆఫర్లు యూజ్ చేసుకుంటే రూ.29,999కే ఈ ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి.. గూగుల్ పిక్సెల్ 8 ప్రో అసలు ధర రూ.99,999 కాగా, ఆఫర్లో రూ.82,999 కే లభిస్తోంది.

స్మార్ట్‌ టీవీలపై బిగ్‌ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ సేల్‌లో థామ్సన్‌ 24 ఆల్ఫా001 స్మార్ట్‌ టీవీ కేవలం రూ.5,999 కే భారీ డిస్కౌంట్‌తో సేల్‌లో మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్.. ఇన్‌ఫినికస్‌ 55 % భారీ డిస్కౌంట్‌ను హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్‌ లినక్స్‌ టీవీ 2024 ఎడిషన్‌ కొనుగోలు చేయవచ్చు.

దీని అసలు ధర రూ.16,999 ఐతే, ఈ బిగ్‌ బిలియన్‌ సేల్‌( Flipkart Big Billion Days 2024 ) ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫారమ్‌లో 32 ఇంచెస్ ఈ స్మార్ట్‌ టీవీని రూ.7,500కే కొనుగోలు చేయోచ్చు. ఇకపోతే కొడాక్‌ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్‌ లినక్స్‌ టీవీ 2024 ఎడిషన్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ.14,999 దీన్ని కేవలం రూ.7,999కే 46% భారీ డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు.

అలాగే మార్‌క్యూ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో 32 ఇంచెస్ HD రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్‌ కులీటా టీవీ అసలు ధర వచ్చేసి రూ.21000 ఈ సేల్‌లో కేవలం రూ.7,799కే కొనుగోలు చేయోచ్చు. దీనిపై 62% భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. 24 ఇంచెస్ టీవీ రూ.6499కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,900.

టూ వీలర్స్ పై ఎట్రాక్టివ్ డిస్కౌంట్స్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్( Flipkart Big Billion Days 2024 ) లో టూ వీలర్స్ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. బజాజ్ ఆటో చేతక్ స్కూటర్ ని పూర్తిగా ఎలక్ట్రిక్ ఫార్మాట్ లో తిరిగి ప్రవేశపెట్టారు. చేతక్ 3202 వేరియంట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ మోడల్ మ్యాగ్జిమం గంటకు 63కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.

ఒక సారి ఫుల్ గా చార్జ్ చేస్తే 137కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తి ఛార్జ్ చేయడానికి సుమారు 5.83 గంటలు పడుతుంది. బజాజ్ 50,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల కాలవ్యవధి గల వారంటీని అందిస్తుంది. చేతక్ 3202 ప్రైజ్ ఫ్లిప్ కార్ట్ లో రూ.1,12,518గా ఉంది.

పల్సర్ ఇండియన్ మార్కెట్లో అత్యంత గుర్తింపు పొందిన మోటార్ సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలుస్తుంది. ప్రెజెంట్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో పల్సర్ 125 స్టార్టింగ్ ప్రైజ్ రూ.79,843గా ఉంది. మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.81,843. పల్సర్ 125 పల్సర్ రేంజ్ లో అతిచిన్న, అత్యంత చౌకైన మోడల్.

హీరో స్ప్లెండర్ భారతీయ మార్కెట్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అత్యంత ఇష్టపడే కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో ఒకటి. ఇది దాని క్రెడిబిలిటీ, చౌకైన మెయింటినెన్స్, పోటీ ధర, వండర్ఫుల్ ఇంజన్ క్యాపాసిటీకి గుర్తింపు పొందింది. స్ల్పెండర్ ప్లస్ ఎక్స్టీఈసీ స్టార్టింగ్ ధర రూ.92,515 కాగా, ఫ్లిప్ కార్ట్ రూ.80,161 ధరకి ఈ బైక్ ని అందిస్తోంది.

ది అడ్వెంచర్ అనేది యెజ్డీ అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్. ఫ్లిప్ కార్ట్ యెజ్డీ అడ్వెంచర్ ను రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది, దీని ధర రూ.2,07,400. డీలర్ షిప్ లు అదే మోటార్ సైకిల్ ని రూ.2.10లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైజ్ తో రిటైల్ చేస్తున్నాయి.

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో కరిజ్మాను పూర్తిగా కొత్తరూపంలో తిరిగి ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు బ్రాండ్ లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోటార్ సైకిల్ గా నిలుస్తుంది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ ఎక్స్-షోరూమ్ ప్రైజ్ రూ.1,80,900 కాగా, ఫ్లిప్ కార్ట్ ఈ మోటార్సైకిల్ ని రూ.1,78,900 కే అందిస్తుంది.

హీరో ఎక్స్ ట్రీమ్ 125R హీరో మోటోకార్ప్ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల రేంజ్ లో సరికొత్త ఎంట్రీ. ఎక్స్ట్రీమ్ 125 R ని పూర్తిగా న్యూగా డిజైన్ చేశారు. ఇది ట్రెడిషనల్ కమ్యూటర్ మోడళ్ల నుండి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ టీవీఎస్ రైడర్ కు డైరెక్ట్ కాంపిటేటర్ గా నిలిచింది. ప్రెజెంట్ ఎక్స్ ట్రీమ్ 125R ఐబీఎస్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.93,000కు, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.97,500గా ఉంది.

హీరో గ్లామర్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. అందుబాటులో ఉన్న ఎంపికలలో డ్రమ్, డిస్క్ వేరియంట్లు, అలాగే X TEC వెర్షన్లు ఉన్నాయి. వీటి ధర వచ్చేసి రూ.81,098 – రూ.86,998 వరకు ఉంది.

Flipkart Big Billion Days 2024 – అతితక్కువ ధరలకే ల్యాప్ టాప్స్

Flipkart Big Billion Days 2024

Flipkart Big Billion Days 2024 – హెచ్ పీ క్రోమ్ బుక్

ఈ ల్యాప్ టాప్ లో 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 8 కోర్ల మీడియా టెక్ ఎంటీ 8183 ప్రాసెసర్, 4GB ర్యామ్, 32GB స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి.  మైక్రో ఎస్ డీని ఉపయోగించి స్టోరేజ్ ను విస్తరించవచ్చు.

కనెక్టివిటీకి సంబంధించి వైఫై 5, బ్లూటూత్ 4.2కి సపోర్ట్ ఉంటుంది. రెండు యూఎస్ బీ టైప్ సి పోర్టులు, 16గంటల బ్యాటరీ సామర్థ్యం అదనపు ప్రత్యేకతలు. ఈ ల్యాప్ టాప్ రూ.9,990కి అందుబాటులో ఉంది.

అదనంగా ఫ్లిప్ కార్ట్, హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులపై రూ.999, HDFC డెబిట్ కార్డులపై రూ.750, ఫ్లిప్ కార్డు యాక్సెస్ క్రెడిట్ కార్డుపై రూ.500 చొప్పున బ్యాంకు డిస్కౌంట్లు ఉన్నాయి.

Flipkart Big Billion Days 2024 – హెచ్ పీ టచ్ క్రోమ్ బుక్

మీడియా టెక్ ఎంటీ 8183 ప్రాసెసర్ పై పనిచేసే హెచ్ పీ టచ్ క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ లో 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4 GB ర్యామ్, 32 GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు.

వైఫై 5, బ్లూటూత్ 4.2, కనెక్టివిటీ కోసం రెండు యూఎస్ బీ టైప్ సి పోర్టులు ఏర్పాటు చేశారు. దాదాపు 16గంటల బ్యాటరీ క్యాపాసిటి దీని ప్రత్యేకత. విద్యార్థులకు, తేలిక పాటి మల్టీ టాస్కింగ్ కు బాగుంటుంది. HP టచ్ క్రోమ్ బుక్ ధర రూ.10,990.

Flipkart Big Billion Days 2024 – అల్టిమస్ ప్రో

సొగసైన డిజైన్, దాదాపు 6 గంటల బ్యాటరీ బ్యాకప్ తో అల్టిమస్ ప్రో ల్యాప్ టాప్ ఆకట్టుకుంటోంది. దీనిలో 14.1 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్,128GB స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

విండోస్ 10లో రన్ అవుతుంది. కనెక్టవిటీ కోసం Wifi బ్లూటూత్, USB పోర్టులు, హెచ్ డీఎంఐ పోర్టులు ఏర్పాటు చేశారు. ప్రయాణంలో కూడా చాాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. అల్టిమస్ ప్రో ల్యాప్ టాప్ ధర రూ.11,990

ఫ్లిప్‌కార్ట్ సేల్( Flipkart Big Billion Days 2024 ) సమయంలో కస్టమర్‌లు కేవలం మొబైల్స్, స్మార్ట్ టీవీలు, టూ వీలర్స్, ల్యాప్ టాప్స్ పై మాత్రమే కాకుండా హోమ్‌ ప్రోడక్ట్స్, క్లాత్స్, ఎలక్ట్రిక్‌ గ్యాడ్జెట్స్, తదితర వస్తువులపై భారీ తగ్గింపును ఇస్తోంది. కాబట్టి, ఇప్పటికైనా మించిపోయింది లేదు.. వెంటనే త్వరపడండి.పొందవచ్చు.



Leave a Comment