Budget 2024 : కేంద్ర బడ్జెట్ 2024-25 హైలైట్స్.

Written by Sandeep

Updated on:

Budget 2024: మన ప్రియతమా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భారతదేశ చరిత్రలో 7 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇది ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.

Budget 2024 – నిర్మలా సీతారామన్‌:

మనీలాండరింగ్‌ను ఆపటంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అనేది ముఖ్యమైన విష్యం.. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు( Budget 2024 ) ఆటంకంగా మారింది. యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ​​ట్యాక్స్‌ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.  పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.  ఎప్‌ అండ్‌ ఓల్లో ఎస్‌టీటీ ఛార్జీలు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వస్తాయి.

ఈ సంవత్సర కేంద్ర బడ్జెట్‌( Budget 2024 ) 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు. అందులో మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ. ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.

 రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.  నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు. పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు. మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు. యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్‌,  మహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్‌. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.  ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.

భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తాం.  పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం. స్టాంప్‌ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి. పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.  ట్యాక్స్‌ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్ పన్నులు, సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేసే ద్రవ్య పరిమితులను  రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా ప్రకటించారు.

 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు గత సంవత్సరం కంటే తగ్గించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది  రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి. 

జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్‌లో రూ.42,277 కోట్లు.  అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు. చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు. దేశ సరిహద్దు లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.  ముఖ్యమయిన మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి తొలగింపు. 

విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది. ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి. 30 లక్షల కంటే అధిక జనాభా ఉన్న 14 మహా నగరాల కోసం రవాణా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయటం.

Budget 2024 – బడ్జెట్‌ 2024-25 కేటాయింపులు  ఇప్పుడు చూద్దాం.

రక్షణ వ్యయం రూ.4.56 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి రూ.2,65,808 కోట్లు. వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1,51,851 కోట్లు. హోం వ్యవహారాలు రూ.1,50,983 కోట్లు. విద్య రూ.1,25,638 కోట్లు.  ఐటీ, టెలికాం రూ.1,16,342 కోట్లు. ఆరోగ్యం రూ.89,287 కోట్లు. ఎనర్జీ రూ.68,769 కోట్లు. 

సాంఘిక సంక్షేమం రూ.56,501 కోట్లు. వాణిజ్యం, పరిశ్రమల రంగం రూ. 47,559 కోట్లు. కొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7 లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10 లక్షలు-రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.

పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు. ట్రేడింగ్‌ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్లపై ఎస్‌టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను. క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు. స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు. ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు.

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు. న్యూ క్లియర్‌ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు. ఫార్మాసూటికల్స్‌ రంగంలో పీఎల్‌ఐ పథకానికి రూ.2,143 కోట్లు. సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.  సోలార్‌ పవర్‌(గ్రిడ్‌) రూ.10 వేలకోట్లు. ఎల్‌పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు. రూపాయి రాక.

 ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 19 శాతం,  ఎక్సైజ్‌ డ్యూటీ 5 శాతం, అప్పులు, ఆస్తులు 27 శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం, మూలధన రశీదులు 1 శాతం, కస్టమ్స్‌ ఆదాయం 4 శాతం, కార్పొరేషన్‌ ట్యాక్స్‌ 17 శాతం, జీఎస్టీ, ఇతర పన్నులు 18 శాతం రూపాయి పోక. పెన్షన్లు 4 శాతం, వడ్డీ చెల్లింపులు 19 శాతం, కేంద్ర పథకాలు 16 శాతం, సబ్సిడీలు 6 శాతం, డిఫెన్స్‌ 8 శాతం

రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 శాతం, ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 9 శాతం, కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 శాతం,  ఇతర ఖర్చులు 9 శాతం బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు. మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.  జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎ‍స్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. 

ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాశీ విశ్వనాధుని ఆలయం అభివృద్ధి, నలంద విశ్వా విద్యాలయం పునః నిర్మాణం, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక  ఏర్పాటు.

రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 శాతం, ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 9 శాతం, కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 శాతం,  ఇతర ఖర్చులు 9 శాతం బడ్జెట్( Budget 2024 ) ముఖ్యాంశాలు ఇవే. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై బద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎ‍స్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. 

ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో కాశీ విశ్వనాధుని ఆలయం అభివృద్ధి, నలంద విశ్వా విద్యాలయం పునః నిర్మాణం, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక  ఏర్పాటు.



Leave a Comment