AP Ministers 2024: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరియు వారి బాధ్యతలు

Written by Sandeep

Updated on:

AP Ministers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24 మందికి శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. యువతకు కూడా ముఖ్యమైన శాఖల్ని కేటాయించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

AP Ministers – ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

నారా చంద్రబాబు నాయుడు: సీఎం, లా అండ్‌ ఆర్డర్‌, జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖలు
1) కొణిదెల పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, పర్యావణ, అడవులు, సైన్స్ & టెక్నాలజీ శాఖలు
2) వంగలపూడి అనిత – హోం శాఖ
3) నారా లోకేష్ – ఐటీ, మానవవనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖలు
4) కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్‌ & పశుసంవర్థక శాఖ, మత్స్య, డెయిరీ డెవలప్మెంట్‌ శాఖలు
5) కొల్లు రవీంద్ర – గనులు, ఎక్సైజ్ శాఖలు
6) నాదెండ్ల మనోహర్ – ఆహార శాఖ, పౌర సరఫరాల శాఖలు
7) పి నారాయణ – మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మరియు అర్బన్‌ డెవలప్మెంట్‌ శాఖ
8) సత్యకుమార్ యాదవ్ – కుటుంబ సంక్షేమ, ఆరోగ్య, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ శాఖలు
9) నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి శాఖలు
10) ఎన్.ఎమ్.డి. ఫరూక్ – మైనార్టీ, న్యాయ శాఖలు
11) ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయ శాఖ
12) పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక శాఖ, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు శాఖలు


13) అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖలు
14) కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణ శాఖతో పాటు I&PR శాఖ
15) డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ శాఖలు
16) గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్‌ శాఖ
17) కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
18) గుమ్మడి సంధ్యారాణి -స్త్రీ, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖలు
19) బీసీ జనార్థన్ రెడ్డి – రహదారులు శాఖ, భవనాల శాఖ
20) టీజీ భరత్ – పరిశ్రమలు శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
21) ఎస్. సవిత – బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ & టెక్స్‌టైల్స్‌ శాఖలు
22) వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ శాఖలు
23) కొండపల్లి శ్రీనివాస్ – SERP, MSME, NRI శాఖ మరియు ఎంపవర్మెంట్‌ శాఖ
24) మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా శాఖ, యువజన సర్వీసులు, క్రీడలు శాఖలు

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో సీనియర్లకి ప్రాధాన్యం ఇస్తూనే.. యువతకి కీలకమైన శాఖల బాధ్యతల్ని అప్పగించారు. నారా లోకేష్‌కు ఊహించినట్లే ఐటీ శాఖను కేటాయించారు. నారాయణకు 2014 నుంచి 2019 మధ్య నిర్వహించినటువంటి మున్సిపల్ శాఖే దక్కింది. ఇక పవన్ కళ్యాణ్‌‌కైతే, తనకి ఫస్ట్ నుంచి ఎంతో ఇష్టమని చెబుతున్న శాఖలే దక్కాయి.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి 6 శాఖలు.. పెద్ద సవాలే

AP Ministers

జనసేన పార్టీకి షణ్ముఖ వ్యూహం ఉంది. అంటే ఆరు వ్యూహాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు శాఖల బాధ్యతలు తీసుకున్నారు. మరి వాటికి ఆయన న్యాయం చెయ్యగలరా..? ఆరు శాఖలు ఆయనకి భారంగా మారవా..?

మన దేశంలో ఇచ్చిన ఒక్క శాఖని కూడా సవ్యంగా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న మంత్రులు చాలా మందే ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు శాఖల్ని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు. ప్రశ్న ఏంటంటే.. ఈ శాఖలన్నింటికీ పవన్ న్యాయం చెయ్యగలరా అన్నదే. మరి ఈక్రమంలో మనం ఒక్కొక్క శాఖనూ ఇప్పుడు పరిశీలిద్దాం.

AP Ministers – పంచాయతీ రాజ్

పంచాయతీ రాజ్ శాఖ చాలా కీలకమైనది. ఈ శాఖను వైసీపీ పూర్తిగా నీరుగార్చింది. ఫలితంగా ఘోర ఓటమి చూసింది. గ్రామాలతో ప్రభుత్వానికి కనెక్ట్ చేసే శాఖ ఇదే. గ్రామాల్లో యువత, రైతులు, మహిళలందరూ తగిన సంక్షేమ ఫలాలు పొందాలన్నా, తమ గోడును చెప్పుకోవాలన్నా.. పంచాయతీ రాజ్ శాఖే మొదటి మెట్టుగా ఉంటుంది.

అంతేకాదు.. పల్లె ప్రజల్లో అసంతృప్తి కూడా మొదట వెల్లడయ్యేది పంచాయతీ రాజ్ శాఖ దగ్గరే. అందుకే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్.. ఈ శాఖని తీసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాలన అనేది సక్రమంగా సవ్యంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే అంచనా ఉంది.

AP Ministers – గ్రామీణాభివృద్ధి

ఈ శాఖ కూడా పంచాయతీ రాజ్ శాఖ లాంటిదే. ఆంధ్రప్రదేశ్ లో సిటీలు, పట్టణాల కంటే గ్రామాలే చాలా ఎక్కువ. పేదలు కోట్లలో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుంది. అక్కడ తాగునీటి వసతులు, విద్య, ఆరోగ్యం, వైద్యం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.

ఇది పెద్ద బాధ్యతే. నిరంతరం గ్రామాల్లో ఉంటేనే.. ప్రజల కష్టాలు, బాగోగులు తెలుస్తాయి. ఇది ఆల్రెడీ గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాను త్వరలోనే గ్రామాల్లో తిరుగుతానని అన్నారు. తద్వారా ఆయన రైట్ ట్రాకే ఎంచుకున్నారనుకోవచ్చు.

Tirupati Laddu Row
Nara Chandrababu Naidu – Andhra Pradesh CM

AP Ministers – పర్యావరణం

ఇది కూడా కీలకమైన శాఖే. జనరల్‌గా పర్యావరణం గురించి ప్రజలు పెద్దగా మాట్లాడుకోరు. కానీ పెట్టుబడులు పెట్టేవారు.. పర్యావరణాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వాతావరణం ఎలా ఉంటుంది? అడవులు ఏ స్థాయిలో ఉన్నాయి? తీర ప్రాంతం ఎలా ఉంది? కాలుష్యం ఏ స్థాయిలో ఉంది? అన్ని రకాల వనరులూ లభిస్తున్నాయా? ఇలా ప్రతీదీ ఆలోచిస్తారు.

అందువల్ల పర్యావరణ కాలుష్యం అలాగే ఇతర సమస్యల నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సి వస్తుంది. జగన్ హయాంలో చెట్లు కూల్చేశారు. రుషికొండను చెక్కేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి.. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్.. పర్యావరణాన్ని కాపాడతారనే అంచనాలు ఉన్నాయి.

AP Ministers – తాగునీటి సరఫరా

ఇది మరో సవాలుతో కూడిన శాఖ. ఏపీలో తాగు నీటి సమస్య చాలా పెద్దగా ఉంది. పోలవరం గనుక పూర్తి అయ్యి ఉంటే.. ఈ సమస్య చాలా వరకు తీరేదనే చెప్పాలి. అది పూర్తి కాలేదు. రాయలసీమలో ప్రజలకు తాగు నీటి కొరత బాగా ఉంది. ఇంటింటికీ కుళాయిని తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ఆ బాధ్యతని ప్రెజెంట్ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సి వస్తుంది.

ఎన్నికల్లో ఈ హామీ కూడా కూటమికి ప్లస్ అయ్యిందనే విశ్లేషణలు ఉన్నాయి. అందువల్లన తాగునీటి సప్లయ్ విషయంలో సక్సెస్ గనుక కాకపోతే, ప్రజాగ్రహం చూడాల్సి వస్తుంది. అందువల్ల ఈ శాఖ కూడా సవాలే అనుకోవచ్చు.

AP Ministers – అడవులు

రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం మరో పెద్ద సవాలు. నిజానికి ఏపీలో అడవులు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఏపీలో నల్లమల అడవులతోపాటుగా.. తూర్పు కనుమలు, శేషాద్రి కొండలు.. ఇలా చాలానే అటవీ సంపద ఉంది. దాన్ని పరిరక్షిస్తూనే.. అడవులు, చెట్ల పెంపకంపైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది.

ఏపీలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఒకటి రెండు డిగ్రీస్ తగ్గాలంటే కూడా అడవుల్ని బాగా పెంచాల్సి ఉంటుంది. అడవులు పెరిగితే.. ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చి, పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

AP Ministers – సైన్స్ అండ్ టెక్నాలజీ

ప్రజలు పెద్దగా మాట్లాడుకోని మరొక కీలక శాఖ ఏంటంటే.. సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ దేశాలకి వెళ్లిన చాలా మంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నారు.

ఐతే.. ఈ రంగంలో ఏపీలో ఏమాత్రం అభివృద్ధి లేదు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్.. దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెడితే.. ఈ రంగంలో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ని పెద్దమొత్తంలో భారీగా రాబట్టే అవకాశాలు ఉంటాయి.

తద్వారా ఫార్మా, ఐటీ, ఆక్వా వంటి ఎన్నో రంగాల్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలనేవి పెరగగలవు. అందువల్ల ఏ శాఖ కూడా తేలికైనది కాదు. అన్నీ ముఖ్యమైనవే. అందువల్లన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వీటన్నింటినీ నిర్వహిస్తూ.. ముందుకు తీసుకెళ్లడం అనేది పెద్ద సవాలనే చెప్పాలి.

వంగలపూడి అనితకు హోం శాఖ.. ఎందుకో తెలుసా..?

HOME MINISTER – Vangalapudi Anitha

వంగలపూడి అనితకు హోం మంత్రి( AP Ministers ) పదవి కట్టబెట్టడం వెనుక స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మమైన అడుగులు వేసారు.

పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖ కేటాయిస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరించారంటున్నారు కొందరు విశ్లేషకులు.

గత ప్రభుత్వం రెండుసార్లు ఎస్సీ సామాజికవర్గం, అందులోనూ మహిళకే హోం శాఖని కట్టబెట్టడం మనమందరం చూశాం. మొదటి దఫాలో మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో హోమ్ మినిస్టర్‌గా పదవీ బాధ్యతలు అప్పగించారు.

సేమ్‌ టూ సేమ్‌ చంద్రబాబు నాయుడు కూడా అదే ఫార్ములా యూజ్ చేసారు. సుచరిత, వనితల సామాజిక వర్గానికి చెందిన మహిళనే హోం మంత్రి( AP Ministers ) చేశారు.

ఉన్నవారిలోకెల్లా ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలు వంగలపూడి అనితేనన్న ముద్ర పడటం కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే, పోరాడే నాయకురాలని పేరు తెచ్చుకున్న అనితకు తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకులు ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. 



Leave a Comment