Thalapathy Vijay: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తొలి సభతోనే తమిళనాడును షేక్‌ చేసిన దళపతి.. మహానాడులో దుమ్మురేపిన వైనం.. 8 లక్షల మంది హాజరు

Written by admin

Updated on:

Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీతో హీట్ పెరిగిపోయింది. అయితే తమిళనాడులో రాజకీయాలపై సినిమా ప్రభావం ఎంతో ఉంది. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత సినిమా తారలే. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రాజకీయ ప్రయత్నాలు చేసినా కూడా వారు సక్సెస్ కాలేదు.

స్టార్ హీరో విశాల్ కూడా భవిష్యత్ లో పొలిటికల్ పార్టీ స్థాపించే ఉద్దేశం ఉన్నట్లు గతంలో తెలిపాడు. ఇక శివాజీ గణేషన్‌, విజయ్ కాంత్‌, శరత్‌ కుమార్‌ కూడా క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టినా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ భవిష్యత్తు మరో రెండేళ్లలో తెలియనుంది. ఇక ఈక్రమంలో విజయ్ దళపతి నిర్వహించిన తొలి రాజకీయ సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం…

దక్షిణాది రాష్ట్రాల్లోనే మరో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పటికే జాతీయ , ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్న ఈ రాష్ట్రంలో వాటిని ఢీకొనేందుకు సినీ నటుడు విజయ్ దళపతి( Thalapathy Vijay ) తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ పెట్టడమే కాకుండా ఆదివారం తొలి రాజకీయ సభను నిర్వహించి సక్సెస్ అయ్యాడు.

విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడు బహిరంగసభ ద్వారా విజయ్ నిజంగా హీరో అనిపించుకున్నాడు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. తప్పని సరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వంపై పేరు ప్రస్తావించకుండా తనదైన స్టైల్లో సెటైరికల్‌గా విమర్శలు చేసారు.

Thalapathy Vijay – పొలిటికల్ సెటైరికల్ మూవీ..

సినిమా హీరోలకు రాజకీయాలు అర్ధం కాదు.. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించలేరు.. వంటి పొలిటికల్ పార్టీలు చేసే విమర్శలను ఓ చిన్న కథగా చెప్పుకొచ్చాడు విజయ్. ముందుగా బహిరంగ సభ వేదికపైకి నడుచుకుంటూ వస్తున్న విజయ్‌ని చూసి జనం కేకలు, అరుపులతో హోరెత్తించారు. మరికొందరు పార్టీ రంగులోని కండువాలను సైతం విసిరివేసి ఆయనకి బాగా సపోర్ట్ చేశారు. అందరి మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన విజయ్ చిన్న కథ చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. వేదికపై విజయ్ చెప్పిన కథే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. అతను చెప్పిన చిన్న కథ ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

Thalapathy Vijay – ఫస్ట్ స్పీచ్‌తోనే విజయ్ రెబల్

రాజకీయాల్లో రాణించాలంటే కాస్తో.. కూస్తో ప్రత్యర్ధులపై పంచ్‌లు కురిపించాలి అనే లాజిక్ పట్టుకున్న విజయ్( Thalapathy Vijay ).. తన తొలి సభ ప్రసంగంలోనే ఆ వాగ్ధాటిని ప్రదర్శించాడు. ముందుగా దేశ స్వాతంత్ర్యం కోసం, రాష్ట్రం కోసం పాటు పడిన యోధులు, మహనీయుల్ని స్మరించుకున్న విజయ్ తన రాజకీయ శత్రువులను ఓ లిస్టుగా తయారు చేసుకున్నట్లుగా సభలో ఆయన ప్రసంగం ద్వారా తేటతెల్లమైంది. ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నాడో చెప్పే ప్రసంగం మధ్యలోనే ఓ చిన్న కథ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Thalapathy Vijay – విజయ్ నిజంగా దళపతే

నేను మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఇది ఆడియో లాంచ్ లాగా ప్రేరణ కలిగించే స్టోరీ కాదు. ఒక దేశంలో ఎప్పుడైతే పెద్ద యుద్ధం అనేది వచ్చిందో ఆ దేశపు శక్తిమంతమైనటువంటి నాయకత్వం పోయి ఆ బాధ్యత పచ్చ ఎద్దు చేతుల్లోకి వచ్చింది అని చెప్పాడు విజయ్. దీనికి కొనసాగింపుగా ఆ దేశంలోని పెద్ద తలకాయలంతా భయపడ్డారు. చిన్న పిల్లవాడు ఆ దేశంలో సైన్యాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించాడు ఇది యుద్ధభూమిలా ఉంటుందని చెప్పాడు.

కథ రూపంలో ప్రత్యర్ధులపై విజయ్ పంచ్‌లు

ఇకపోతే ఇదంతా పేరు చెప్పకుండానే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన తర్వాత కొందరు చేసిన కామెంట్స్‌ని వినిపించాడు. నువ్వు చిన్న పిల్లవాడివి. ఇది పెద్ద యుద్ధభూమి. శక్తివంతమైన ప్రత్యర్థులు చాలా మంది ఉంటారు. మైదానంలో వారు కలిసే ప్రతిదీ కూడా అసలు సాధారణమైనది కాదు, వినండి, ఇది ఆట కానే కాదు.. బోర్నా సైన్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.. యుద్ధంలో శత్రువులందరినీ అధిగమించి దాడి చేయడం అనేది చాలా ముఖ్యం.. ఆ యుద్ధంలో గెలవడమే ముఖ్య ఉద్దేశ్యం.

యుద్ధానికి నేను రెడీ అంటూ సంకేతం.. విజయే పాండ్య రాజు

ఏ కూటమి లేకుండా మీరు ఆ యుద్ధం ఎలా చేయగలరు? ఎలా గెలవాలి? అని పెద్ద తలకాయలు అందరూ ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఒంటరిగా సైన్యంతో యుద్ధానికి వెళ్లిన పాండ్య వంశానికి చెందినటువంటి ఆ బాలుడు ఏమయ్యాడో తెలుసుకోండి సాహిత్యంలో చాలా చక్కగా చెప్పబడం జరిగింది. చదవని, చదివి నేర్చుకోని వారు.. కాకపోతే అడిగి. కానీ, బ్యాడ్ బాయ్ సార్ ఆ చిన్న పిల్లవాడు అని అన్నాడు. విజయ్ దళపతి పాండ్య వంశానికి చెందిన కుర్రాడు.. అందమైన పాండ్య రాజు అని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే విజయ్ పార్టీ మీద, ఆయన ప్రసంగం మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.

ఈ విధంగా ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవండిలో పార్టీ తొలి మహానాడు జరిగింది. ఈ బహిరంగ సభకు సుమారు 8 లక్షల మందికి పైగా అభిమానులు, రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక ఒకానొక సందర్భంలో పోలీసులు కూడా చేతులెత్తిసిన పరిస్థితి నెలకొంది. అభిమానుల కోలాహలం మధ్య సభా వేదిక పైకి విచ్చేసిన విజయ్ టీవీకే పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పోటీపై సుదీర్ఘ ప్రసంగం చేశారు.

రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్

ఇకపోతే ఈ సభలో విజయ్( Thalapathy Vijay ).. రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాలు పాము లాంటివని అన్నారు. అలాగే తన పొలిటికల్ పార్టీలో అందరూ సమానమేనని, ప్రతీ ఒక్కరికి ప్రతిఫలం లభిస్తుందని అన్నారు. తమిళ రాజకీయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, అందుకే తాను రాజకీయాల్లో వచ్చాననీ, అయితే.. తాను రాజకీయ పార్టీ పెట్టినప్పుడూ.. తనను చాలా రకాలుగా విమర్శించారని గుర్తు చేసుకున్నారు.

వారికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ముఖానికి రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని విమర్శించిన వ్యక్తులకి సైతం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు.. తన తమిళనాడు రాజకీయాలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఎంజీఆర్ కూడా సినిమా రంగం నుంచే వచ్చారనీ, వారు రాజకీయాల్లో మరిచిపోలేని ముద్రవేశారనీ, వారు తన సినిమా కెరీర్ పీక్ లో ఉండగానే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారనీ, వారు రాజకీయం కోసం.. సినిమాలు వదిలేసి.. ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. వారి స్పూర్తిలోనే ఇక్కడ మీ విజయ్( Thalapathy Vijay ) గా వచ్చి నిలబడ్డానని, నన్ను ఆశీర్వదించండి.. అంటూ కోరాడు.

దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) అనే పొలిటికల్ పార్టీను స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈ పార్టీకి సంబంధించిన మహానాడు సభ ఆదివారం రోజు జరిగింది. ఈ సభకు లక్షలాది అభిమానులు తరలివచ్చారు. ఏదేమైనా విజయ్ మాట్లాడిన మాటలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Also Read : ఓజీలో అకిరా నందన్? లీక్డ్ వీడియోతో ఫ్యాన్స్ రచ్చ.. అకిరా నందన్ నటిస్తున్నాడా?


Leave a Comment