Akira Nandan: అసలేం జరుగుతోంది..! ఓజీలో అకిరా నందన్? లీక్డ్ వీడియోతో ఫ్యాన్స్ రచ్చ.. అకిరా నందన్ నటిస్తున్నాడా?

Written by admin

Updated on:

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ అంటూ గత కొన్ని రోజులుగా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. అడివి శేష్ మేజర్ టైంలోనూ ఇటువంటి రూమర్లే క్రియేట్ చేశారు. ఆ గాసిప్ వార్తల మీద అకిరా తల్లి రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అకిరా సినిమాల్లోకి రావడం లేదు.. చదువుకుంటాడు.. అకిరా డెబ్యూ టైం వస్తే.. సినిమాల్లోకి వస్తుంటే.. ముందుగా నేనే ప్రకటిస్తాను అంటూ రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆ సమయంలో కొన్ని రోజుల పాటుగా రూమర్లు ఆగిపోయాయి. ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ యంగ్ కారెక్టర్‌లో అకిరా నందన్( Akira Nandan ) నటిస్తాడంటూ రూమర్లు వచ్చాయి. తాజాగా ఓ వీడియోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. అకిరా నందన్ ఓజీ మూవీ షూటింగ్‌లో ఉన్నాడని, ఇలా ఫైటింగ్ చేస్తున్నాడంటూ అభిమానులు వీడియోని షేర్ చేస్తున్నారు.

ఇందులో ఉన్నది అకిరా నందన్ అని కొందరు నమ్ముతున్నారు. అకిరా నందన్( Akira Nandan ) కాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక వేళ అది అకిరా నందన్ అయితే మాత్రం ఓజీ మూవీ వేరే లెవెల్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

చూస్తుంటే… అకిరా నందన్( Akira Nandan ) కటౌట్‌లానే కనిపిస్తోంది. కానీ, అకిరా నందన్ డెబ్యూ మీద ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. టీం నుంచి కూడా ఎలాంటి లీక్స్ రాలేదు. ప్రెజెంట్ ఓజీ టీం రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ షూట్ ఎక్కువగా చేస్తోంది. ఇమ్రాన్ హష్మీ కూడా వచ్చేశాడని, హీరోయిన్ సీన్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాాణ్ తన చిత్రాలకు డేట్లు కేటాయించేశాడు. ఆల్రెడీ విజయవాడలో హరి హర వీరమల్లు చిత్రాన్ని షూట్ చేశారు. ఆ తరువాత ఓజీ మూవీకి డేట్లు ఇచ్చారు. ఓజీ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి టైం ఇచ్చే అవకాశాలున్నాయి. ఓజీ, హరి హర వీరమల్లు మూవీస్ వచ్చే సంవత్సరం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రిలీజ్ డేట్లు కూడా కన్ఫామ్ చేసుకున్నారు.

Akira Nandan – అసలేం జరుగుతోంది? ఒకేసారి రెండు షూటింగ్‌లు.. సోషల్‌ మీడియాలో అప్‌డేట్లు..!

ఓజీలో అకిరా నందన్ అంటూ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ కాస్త పక్కన పెడితే.. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్‌ కల్యాణ్‌ రెండు పడవల ప్రయాణంలో భాగంగా ఒకవైపు డిప్యూటీ సీఎంగా, మరోవైపు పవర్‌ స్టార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూనే.. సినిమాలకు డేట్స్‌ ఇచ్చారు.

వీకెండ్స్‌లో, నైట్‌ షెడ్యూల్స్‌లో సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఒక సినిమా సెట్‌లో పవన్‌ ఉండగా.. మరో సెట్‌లో ఆయన లేని సీన్స్‌ తీస్తున్నారట. ఈ క్రమంలో విజయవాడ పరిసరాల్లో పవన్‌ కళ్యాణ్ సినిమాల షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇలా విజయవాడ బిజీగా ఉంటే.. మరోవైపు సోషల్‌ మీడియా కూడా బిజీ అవుతోంది.

https://twitter.com/ALLUBROKENBOY/status/1850092725737238697

ఓవైపు నుండి మెగా సూర్య ప్రొడక్షన్స్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఇటీవల షూటింగ్‌ మొదలైంది, పవర్‌స్టార్ట్‌ వచ్చారు అంటూ వాళ్లు చెబుతుంటే.. మరోవైపు ‘ఓజీ’ టీమ్‌ కూడా అదే పనిలో ఉంది. మొన్నీమధ్యనే సుజీత్‌.. తన టీమ్‌తో మాట్లాడుతున్న ఫొటోను షేర్‌ చేసి ‘ఓజీ’ పనులు షురూ అని టీజ్‌ చేసింది. ఆ వెంటనే తమన్‌తో డైరెక్టర్ సుజీత్‌ ఫొటోను షేర్‌ చేసింది.

అంటే ఈ రెండు మూవీస్ తమ ప్రోడక్ట్‌ను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ‘ఓజీ’కి ముందు డేట్స్‌ ఇచ్చి ఆ సినిమా రిలీజ్‌ చేయిస్తారని అనుకున్నారు. ఈ మేరకు మార్చి నెలాఖరు అంటూ డేట్‌ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అనూహ్యంగా పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’కి డేట్స్‌ ఇచ్చారు. ఈ వారాంతంలో అఫీషియల్ గా ‘ఓజీ’ సెట్స్‌కి వస్తారు అని చెబుతున్నారు. దీంతో రెండు టీమ్స్‌ తమ మూవీ గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.

మరోవైపు సినిమాను అమ్ముకునే పనిలోనూ టీమ్స్‌ బిజీగా ఉన్నాయట. నిర్మాతల ఏఎం రత్నం, డీవీవీ దానయ్య ఇదే పనిలో బిజీగా ఉన్నారట. ఓటీటీ డీల్స్‌ ఇప్పటికే ఫైనల్‌ కాగా.. మిగిలిన పనులు చూస్తున్నారట. దీంతో తొలుత వచ్చే సినిమా ఏది? అనే చర్చ విజయవాడ పరిసరాల్లో జరుగుతోంది. మరి పవన్‌ మనసులో ఏముందో? తెలియాల్సి ఉంది.


Also Read : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి.. ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు?


Leave a Comment