Ratan Tata: రతన్‌ టాటా ఆస్తుల విలువ ఎంత? సంపాదన, ప్రాపర్టీలు, కార్లు? టాటా సన్స్ సామ్రాజ్యానికి తర్వాతి వారసుడు ఎవరు? రేసులో నలుగురి పేర్లు..!

Written by Sandeep

Updated on:

Ratan Tata: భారత పారిశ్రామిక రంగానికి లెజెండ్. ఎన్నో కోట్ల మంది యువతకి స్పూర్తి. విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరు రతన్ టాటా( Ratan tata ). ప్రపంచంలో ఎంతమంది వ్యాపార వేత్తలు ఉన్నా కానీ రతన్ టాటా స్థానాన్ని ఎవ్వరూ కూడా అస్సలు రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే ప్రజలకు ఆయన అందించిన సేవలు ఆయన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయి.

అయితే బుధవారం రాత్రి టాటా కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతటి గొప్పవ్యాపారవేత్త మరణవార్త విని దేశంలోని అన్ని రంగాలకు చెందినటువంటి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ రతన్ టాటాకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈక్రమంలో రతన్ టాటా( Ratan tata ) నికర ఆస్తి విలువ ఎంత? ఆయన చేసిన సేవా కార్యక్రమలు, ఆదాయం, సంపద ఎంత? టాటా తరువాత వారసులు ఎవరు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.

Ratan Tata – రతన్ టాటా జీతం, సంపాదన

Ratan Tata Success Story

టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా, రతన్ టాటా( Ratan tata ) యొక్క వార్షికవేతనం సుమారుగా 2.5కోట్ల రూపాయలు (సుమారు $300,000). ఇండస్ట్రీలోని టాప్‌ బిజినెస్‌ లీడర్స్‌తో పోల్చి చూస్తే రతన్‌ టాటా అందుకొనే జీతం చాలాతక్కువే అవుతుంది. ఆయనకు టాటాసన్స్‌లో తన స్మాల్ పర్సనల్ వాటా నుంచి డివిడెండ్స్ కూడా అందుతాయి. అయితే కంపెనీ ప్రాఫిట్స్ లో దాదాపు 66% విద్య, ఆరోగ్యసంరక్షణ, ఇతర సేవాకార్యకలాపాలు చేపడుతున్న ఛారిటబుల్ ట్రస్ట్‌లకు వెళుతుంది.

పెట్టుబడులు, ఆస్తులు.. టాటా సన్స్‌లో వాటా

టాటా సన్స్‌లో రతన్ టాటాకు వాటా ఉంది. వాటా చాలా చిన్నదే అయినప్పటికీ, టాటాగ్రూప్ పలు విభిన్న పరిశ్రమలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇది చాలా విలువైనది. ఈ వాటా ద్వారా రతన్‌ టాటా సంపాదించే మొత్తండబ్బులో ఎక్కువభాగం టాటా ట్రస్ట్‌ల ద్వారా స్వచ్ఛందసంస్థకు విరాళంగా వెళుతుంది. విద్య, ఆరోగ్యసంరక్షణ వంటి రంగాల్లో ఇతరవ్యక్తులకు సాయం చేసేందుకుగాను కేటాయిస్తారు. రతన్ టాటా ఓలా, పేటీఎం సహా కొన్ని స్టార్టప్స్, టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు.

Ratan Tata – రియల్ ఎస్టేట్

రతన్ టాటాకు అనేక ప్రాపర్టీలు ఉన్నాయి. వీటన్నింటిలో ముంబైలో ఉన్నటువంటి కోలాబాలో సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లా చాలా కాస్ట్లీ. దీని విలువ సుమారుగా రూ.150 కోట్ల కంటే ఎక్కువ.

రతన్‌ టాటా( Ratan Tata ) కార్ కలెక్షన్: రతన్ టాటాకు కార్లంటే ఎంతో ఇష్టం. ఆయన కలెక్షన్‌లో టాటాకార్ మోడల్స్ నుంచి ఇతర కంపెనీస్ యొక్క లగ్జరీ, హై-పర్ఫార్మెన్స్‌ వెహికల్స్‌ ఎక్కువే ఉన్నాయి.

టాటా నానో: ‘ది పీపుల్స్ కార్’గా పిలిచే టాటా నానో ప్రపంచంలోనే అత్యంత సరసమైన కారుగా గుర్తింపు పొందింది. రతన్ టాటా దగ్గర బ్లూ, సిల్వర్‌లోని టాటా నానో స్పెషల్‌ వెర్షన్‌ ఉంది.  టాటా మోటార్స్‌కి చెందినటువంటి పాపులర్‌ SUV టాటా నెక్సాన్‌ కూడా రతన్ టాటా వినియోగించేవారు. ఈ మోడల్‌ బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లో గొప్ప సక్సెస్ ని అందుకుంది.

మెర్సిడెస్-బెంజ్ SL500: ఇది హై-క్లాస్ కన్వర్టబుల్ 5.0L సూపర్ఛార్జ్డ్ V8 పవర్‌, స్టైల్‌తో పాటుగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనేముందు రతన్ టాటా ఈ SUVని డ్రైవ్‌ చేస్తూ కనిపించారు.

మసెరటి క్వాట్రోపోర్టే: ఇటాలియన్ ఆర్ట్‌కు ప్రసిద్ధి చెందినటువంటి లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ మసెరి క్వాట్రోపోర్టే కూడా రతన్ టాటా కలెక్షన్‌లో ఉంది, కాడిలాక్ XLR: రతన్ కలెక్షన్‌లోని ఈ కా యొక్క స్టైల్‌, పర్ఫార్మెన్స్‌ చాలా అద్భుతంగా ఉంటుంది, చేవ్రొలెట్ కొర్వెట్టి: ఇది ఐకానిక్ అమెరికన్ స్పోర్ట్స్ కారు.
హోండా సివిక్: ఈ ఓల్డ్ మోడల్‌ సేఫ్టీ, పర్ఫార్మెన్స్‌తో మార్కెట్‌లో బాగా సక్సెస్ అయ్యింది.

రతన్ టాటా ఆరోగ్యసంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి, ఇతర అవసరాలకు సంబంధించి $1.2బిలియన్లు (సుమారు రూ.9,000 కోట్లు) విరాళంగా ఇచ్చారు. రతన్‌ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కి $50 మిలియన్ల డబ్బుని విరాళంగా అందించారు. దీంతో అందులో టాటా హాల్ నిర్మించారు.

భారతీయ స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్‌లను అందించడానికి కార్నెల్ యూనివర్సిటీకి $28 మిలియన్లు అందించారు. అలానే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ విద్యాకార్యక్రమాలకు మద్దతుగా $35 మిలియన్లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆసుపత్రులు, వైద్యపరిశోధనా కేంద్రాల సహా అనేక ఆరోగ్యసంరక్షణ ప్రాజెక్టులకి టాటాట్రస్ట్‌లు నిధులు సమకూర్చాయి.

Ratan Tata – గ్రామీణాభివృద్ధి

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, వెనుకబడినవర్గాల ప్రజలకు మెరుగైన అవకాశాలను కల్పించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. టాటాగ్రూప్ కంపెనీల నుంచి వచ్చే ప్రాఫిట్స్ లో దాదాపు 66% సేవాకార్యక్రమాలకు వెళ్తాయి. సమాజానికి తిరిగి ఇచ్చే ఈ సంప్రదాయం తరతరాలుగా టాటా ఫ్యామిలీలో ఉంది. అదే పద్ధతని రతన్‌ టాటా కూడా ఫాలో అయ్యారు.

వ్యాపారంలో ఎంతో విజయాన్ని సాధించిన రతన్ టాటా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. అందుకే సంపదకు మించిన కీర్తిని సంపాదించి, వ్యాపారవర్గాలకు గొప్పఆదర్శంగా నిలిచారు. ఆయన నాయకత్వం, ఇన్వెస్ట్మెంట్స్, విరాళాల ద్వారా, లక్షలాది జీవితాలకు మార్గం చూపారు. రీసెర్చ్‌, విద్య, ఆరోగ్య సంరక్షణకు భారీగా నిధులు అందజేశారు. భారతదేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి మాత్రమే కాకుండా, సమాజానికి చేసిన మేలుకు దేశప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారు రతన్ టాటా.

ఇకపోతే భారతదేశ ప్రజలందరి హృదయాలలో నిలిచిపోయిన రతన్ టాటా.. కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, దేశాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు. రతన్ నేతృత్వంలో టాటా గ్రూప్ దేశంలో చిన్నచిన్న వ్యాపారాల నుంచి పెద్దపెద్ద కర్మాగారాల వరకు అన్నిరంగాల్లోకి విస్తరించింది. ఆయన సమాజసేవకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. టాటాగ్రూప్ మార్కెట్ వాల్యూ దాదాపు రూ.33.6 లక్షల కోట్లు. రతన్ కన్నుమూసిన తర్వాత, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటాగ్రూప్‌ను ఎవరు నడిపిస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

రతన్ టాటా తన 75వ పుట్టినరోజునాడు, 2012 డిసెంబర్ 28న టాటాసన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకొని, సైరస్‌ మిస్త్రీకి బాధ్యతలు అప్పజెప్పారు. 2016 అక్టోబర్ 24వతేదీన సైరస్‌ను తొలగించి, మళ్లీ టాటాగ్రూప్‌ టెంపరరీ ఛైర్మన్‌ అయ్యారు. 2017 జనవరి 12న నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను గ్రూప్‌ ప్రధానసంస్థ అయిన టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి రతన్‌, టాటాగ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ఆయన తరువాత టాటాసన్స్ వ్యాపార సామ్రాజ్యానికి తదుపరి వారసులు ఎవరు? అని స్టేట్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ లిస్టులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రతన్ టాటా హాఫ్ బ్రదర్ నోయెల్ టాటానే టాటాగ్రూప్‌ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నారు.

నోయెల్ టాటా… నావల్ టాటా రెండోభార్య సిమోన్‌కు నోయెల్ టాటా జన్మించారు. అంటే రతన్‌కి సవతి తమ్ముడు. నోయెల్ చాలాకాలంగా టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ట్రెంట్ కంపెనీని చాలా బాగా మేనేజ్ చేశారు. ఈ కంపెనీ టాటాగ్రూప్‌లోని రిటైల్ డివిజన్‌ను రన్ చేయడం జరుగుతుంది. నోయెల్ టాటాకు కంపెనీని సక్సస్ ఫుల్ గా ఎలా నడపాలో చాలాబాగా తెలుసు. అందుకే చాలామంది ఆయనే టాటాగ్రూప్‌ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నారు.

నెక్స్ట్ జనరేషన్… నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు మాయ, నెవిల్లే, లేహ్ (Leah). వీరు కూడా టాటాగ్రూప్‌లో ఎంతో కాలంగా వర్క్ చేస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా టాటాగ్రూప్ ఛైర్మన్ పదవి రేసులో నిలుస్తున్నారు.

మాయా టాటా

రతన్ టాటాకి( Ratan tata ) చెందిన ఆస్తి ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా యొక్క డాటర్ మాయా టాటాకు దక్కే అవకాశం కనపడుతోంది. మాయ(34), బేయెస్ బిజినెస్ స్కూల్ , వార్విక్ యూనివర్సిటీ నుండి డిగ్రీలు పొందింది. ఆమె తన కెరీర్‌ను టాటా ఆపర్చునిటీ ఫండ్‌తో ప్రారంభించింది. ఆతర్వాత ఆమె టాటాRవ్DDడిజిటల్‌కి మారారు.

అక్కడ ఆమె టాటా న్యూ యాప్‌ను డెవలప్ చేయడంలో.. ప్రారంభించడంలో కీరోల్ ప్లే చేసింది. ఆమె ప్రెజెంట్ తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో వర్క్ చేస్తున్నారు. మాయాటాటా తల్లి దివంగత టాటాగ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సిస్టర్.. దివంగత బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ డాటర్.

నెవిల్లే టాటా

మాయా టాటా బ్రదర్ నెవిల్లే టాటా (32) ఫ్యామిలీ బిజినెస్ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అతను రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా కూడా చూస్తున్నాడు. అతను టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను మ్యారేజ్ చేసుకున్నాడు. జంషెడ్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటాస్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌కు నెవిల్లే నాయకత్వం వహిస్తూ మొత్తం తానే చూసుకుంటున్నాడు.

అంతకుముందు, అతనికి ప్యాకేజ్డ్ ఫుడ్ & బెవరేజ్ సెక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. అందులో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాత, అతను జూడియో, వెస్ట్‌సైడ్‌ల రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నాడు. ఈక్రమంలో అతను టాటాగ్రూప్‌కు వారసుడిగా తయారయ్యాడని చాలామంది నిపుణులు కూడా నమ్ముతున్నారు.

లేహ్ టాటా

నెవిల్లే, మాయా టాటా సోదరి లియాటాటా (39) ఈ సమూహం హోటల్ బిజినెస్ తో సంబంధం కలిగి ఉన్నారు. అతను స్పెయిన్‌లో ఉన్న ఐఈ బిజినెస్ స్కూల్ లో విద్యను అభ్యసించాడు. ఆమె తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్‌లలో పని చేసింది. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అతను 2010వసంవత్సరంలో కొంతకాలం లూయిస్ విట్టన్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశాడు. ఐతే అతని కాన్సంట్రేషన్ మొత్తం హోటల్ పరిశ్రమపైనే ఉంది.

నోయెల్ టాటా మరియు వారి పిల్లలు టాటాగ్రూప్‌ బాధ్యతలను చేపడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే, వీరందరూ కూడా రతన్ టాటా(Ratan Tata) చేసిన మంచి పనుల్ని ఇకపై కూడా అలానే కొనసాగిస్తారనే నమ్మకముంది. రతన్ కోటీశ్వరుడైనా పేదవాళ్ల కోసం ఆలోచించారు. సమాజానికి మంచి చేసేవారు. నోయెల్ టాటా ఫ్యామిలీ కూడా అలాగే చేస్తారనే నమ్మకం చాలా మందికి ఉంది.



Leave a Comment