Ratan Tata Success Story:రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు? టాటా అందుకున్న అవార్డులు, స‌త్కారాలు ఇవే..!

Written by admin

Updated on:

Ratan Tata Success Story: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్నిరోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో బీపీ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఆయన్ను బుధవారం సాయంత్రం ఐసీయూలో ఉంచారు. అనంతరం అర్థరాత్రి, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. రతన్ టాటా ఇక లేరు అనే వార్తను సోషల్ మీడియాలో మొదటగా తెలియజేశారు.

దీని తర్వాత టాటాగ్రూప్ కూడా రతన్ టాటా తుదిశ్వాస విడిచారని ధృవీకరించింది. మరి ఈక్రమంలో గొప్పవ్యక్తిత్వం గల రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏవిధంగా.. ఎలా స్థాపించారు? అనేక విజయాలను అందుకుంటూ.. గొప్ప మానవతావాదిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? అనే విషయాలను వివరంగా తెలుసుకోవడంతో పాటుగా ర‌త‌న్ టాటా అందుకున్న అవార్డులు, స‌త్కారాలు గురించి కూడా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Ratan Tata Success Story In Telugu

Legend – Ratan Naval Tata

1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధానకార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి ఎన్నో రంగాల్లో సేవల్ని అందిస్తోంది. 1990నుంచి 2012వరకు టాటాగ్రూప్‌కు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు.

ఆ తర్వాత అక్టోబరు 2016నుంచి ఫిబ్రవరి 2017వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆయన ఎన్నో సేవలిందించారు. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణనైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేకతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Who is Ratan Tata – రతన్ టాటా ఎవరు..?

Ratan Tata Success Story

రతన్ నావల్ టాటా.. నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా తనయుడు రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. ఆయన కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టా పొందారు. 1961లో టాటాకంపెనీలో చేరారు. అక్కడే ఆయన టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేశారు. ఆతర్వాత 1991లో టాటాసన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Ratan Tata Personal Life – వ్యక్తిగత జీవితం

Ratan Tata Success Story in telugu

1937లో డిసెంబర్ 28వతేదీన ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ ఫ్యామిలీలో రతన్ టాటా జన్మించారు. ఆయన సూరత్‌లో నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని టాటా తర్వాత టాటా కుటుంబంలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు.

1948లో రతన్ టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆతరువాత టాటా అమ్మమ్మ, నవాజ్‌బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకున్నారు. సిమోన్ టాటాని తండ్రి నావల్ టాటా రెండోపెళ్లి చేసుకున్నారు. ఇక దాంతో రతన్ టాటాకు ఒక తమ్ముడు జిమ్మీటాటా, అలాగే సవతిసోదరుడు నోయెల్ టాటా ఉన్నారు.

టాటా తనచిన్నతనంలో ఎక్కువభాగం భారత్‌లోనే గడిపారు. లాస్ఏంజిల్స్‌లో ఉండగా దాదాపు ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. కానీ, దురదృష్టవశాత్తు.. రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం బెబ్బతినడంతో ఆయన భారత్‌కు వెళ్లాల్సి వచ్చింది. తన కాబోయే జీవితభాగస్వామి తనతో కలిసి భారత్ వెళ్లాలని భావించారు. అప్పట్లో ఇండో-చైనా యుద్ధం కారణంగా భారత్ లో నెలకొన్న అస్థిరత కారణంగా రతన్ టాటా( Ratan Tata Success Story ) ప్రేయసి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అక్కడితో వారిద్దరి అనుబంధం ముగిసింది.

Ratan Tata Education and Profession – విద్య, వృత్తి సాగిందిలా..!

Ratan Tata Young

రతన్ టాటా ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలోని కేథరల్ & జాన్ కానన్ స్కూల్లో చదివారు. ఆపై సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో కూడా చదివారు. న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో కూడా చదువుకున్నారు. 1955లో హైస్కూల్ నుంచి పట్టా పొందాక టాటా.. కార్నెల్ యూనివర్శిటీలో జాయిన్ అయ్యారు.

అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. 2008లో టాటా కార్నెల్‌కు 50మిలియన్ డాలర్ల బహుమతిగా అందించి యూనివర్శిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. 1970వసంవత్సరంలో టాటాగ్రూప్‌లో టాటా( Ratan Tata Success Story ) మేనేజిరియల్ పదవిని కూడా పొందారు. 21ఏళ్లలోనే టాటాగ్రూప్ ఆదాయం 40రెట్లు పెరిగింది.

కంపెనీ లాభం 50రెట్లు పెరిగింది. రతన్ టాటా కంపెనీబాధ్యతలు చేపట్టినప్పుడు అత్యధికవిక్రయాలతో జోరుమీద ఉంది. కానీ, ఆతర్వాత అత్యధిక విక్రయాలు కంపెనీ బ్రాండ్ నుంచే వచ్చాయి. 1991లో టాటాసన్స్‌కు చెందిన జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి వైదొలిగడం జరిగింది. రతన్ టాటా ఆయన వారసుడిగా బాధ్యతల స్వీకరణతో ప్రయాణం ప్రారంభమైంది.

రుస్సీ మోడీ (టాటా స్టీల్), దర్బారీ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమితులయ్యారు. సేథ్ (టాటాటీ, టాటాకెమికల్స్), అజిత్ కెర్కర్ (తాజ్ హోటల్స్) నాని పాల్ఖివాలా (పలు టాటాకంపెనీల బోర్డులలో డైరెక్టర్) అలాగే జేఆర్డీ టాటా వారసుడిగా భావిస్తున్నారు. ఇది వారిమధ్య తీవ్రవాగ్వాదానికి దారితీసింది. చాలామంది ఈ నిర్ణయంతో విభేదించారు. అప్పట్లో మీడియా కూడా రతన్ టాటా డెసిషన్ ని తప్పుగా ఎత్తిచూపింది.

కానీ, రతన్ టాటా పట్టుదల, అంకితభావంతో పని చేస్తూనే ఉన్నారు. తన పదవీకాలంలోనే పదవీవిరమణ వయస్సును కూడా నిర్ణయించారు. దానిప్రకారం.. పదవీ విరమణ వయస్సు 70కి నిర్ణయించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 65ఏళ్ల వయస్సులో పదవీవిరమణ చేస్తారు. సేథ్, కెర్కర్ వయస్సు పరిమితి దాటగా వారు పదవీవిరమణ చేశారు. అనారోగ్య కారణాలవల్ల పాల్ఖివా ఉద్యోగం నుంచి నిష్క్రమించారు. వారసత్వ సమస్య పరిష్కరించిన తరువాత రతన్ టాటా( Ratan Tata Success Story ) ముఖ్యమైన వాటిపై దృష్టి సారించడం మొదలుపెట్టారు.

టాటా బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించుకున్నందుకు టాటాసన్స్‌కి రాయల్టీ చెల్లించమని గ్రూప్ కంపెనీలను ఒప్పించాడు. వ్యక్తిగత కంపెనీలను గ్రూప్ ఆఫీసుకు రిపోర్టు చేయమన్నారు. సాఫ్ట్‌వేర్ వంటి ఇతర వాటిపై దృష్టిని పెంచింది. టెలికాం వ్యాపారం, ఫైనాన్స్ రిటైల్‌లో కూడా టాటాగ్రూపు ప్రవేశించింది. అదేసమయంలో విమర్శలొచ్చినప్పటికీ జేఆర్డీ టాటా రతన్ టాటాకు( Ratan Tata Success Story ) మార్గదర్శకుడిగా మార్గనిర్దేశం చేయడం జరిగింది.

Achievements of Ratan Tata – రతన్ టాటా సాధించిన విజయాలు

కెరీర్ ప్రారంభంలో అనుభవంలేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటాగ్రూప్ పగ్గాలను చేపట్టారు. 65శాతం ఆదాయాలు విదేశాల నుంచి వచ్చేవిధంగా నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపుఆదాయాలు 40రెట్లు పెరిగాయి. రానురానూ కంపెనీలాభాలు 50రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటాగ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. ఇందులో లండన్‌కు చెందినటువంటి టెట్లీ టీని 431.3మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

దక్షిణకొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కుల తయారీ యూనిట్‌ను 102మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆంగ్లో-డచ్ కంపెనీ కోరస్ గ్రూప్‌ని 11.3బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. టాటా( Ratan Tata Success Story ) టీ ద్వారా టెట్లీ, టాటామోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటాస్టీల్ ద్వారా కోరస్‌తోసహా ఈ కొనుగోళ్లు టాటాగ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. దాదాపు 100దేశాలకుపైగా టాటాకంపెనీ వ్యాపారసామ్రాజ్యం విస్తరించింది. భారతీయ పారిశ్రామికరంగంలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.

Ratan Tata NANO Car – టాటానానో అరంగ్రేటం

2015లో రతన్ టాటా.. టాటానానో కారును ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మధ్య, దిగువ-మధ్య-ఆదాయ వినియోగదారులకు అత్యంత సరసమైనదిగా మారింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈకారు ప్రారంభధర 2వేల డాలర్లు. టాటానానో అనేది స్థోమతపరంగా సామాన్యుల కారుగా పేరుగాంచింది.

Ratan Tata Retirement – 75ఏళ్ల వయస్సులో పదవీవిరమణ

రతన్ టాటా డిసెంబరు 28వతేదీ 2012వసంవత్సరం డెభైఏళ్ల వయసులో పదవీవిరమణ చేయడం జరిగింది. ఆయన తరువాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందినటువంటి సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డ్ఆఫ్ డైరెక్టర్ల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది. దాంతో మిస్త్రీని 2016లో ఆయన ఆస్థానం నుంచి తొలగించారు. రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా పనిచేశారు. 2017వసంవత్సరం జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం, రతన్ టాటా( Ratan Tata Success Story).. టాటాట్రస్ట్స్, టాటాసన్స్‌కి నాయకత్వం వహిస్తుండగా.. జేఆర్డీ టాటా తర్వాత రెండు కంపెనీలకు రెండో అధినేతగా ఆయనే ఉన్నారు.

విద్యారంగంలో నాణ్యమైన విద్య కోసం అనేక విరాళాలను అందించారు. వైద్యరంగానికి కూడా తనవంతు కృషిగా అనేకవిరాళాలను అందించారు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ధికి కూడా తనవంతు సహకారం అందించారు. 1991వఏడాదిలో సర్ రతన్ టాటా( Ratan Tata Success Story ) ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి.. ఈ ట్రస్ట్ ద్వారా వివిధరంగాల్లో వెనుకబడినవారి సంక్షేమం కోసం సేవలందించారు.

Ratan Tata Awards – ర‌త‌న్ టాటా అందుకున్న అవార్డులు, స‌త్కారాలు ఇవే..!
Ratan Tata Success Story - Awards

దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నతపురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ 2006లో మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది.

2014వసంవత్సరంలో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు, 2021లో అస్సాం వైభవ్‌తో రతన్ టాటాను సన్మానించారు, 2023లో ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు.

2004వసంవత్సరంలో మెడల్ ఆఫ్ ద ఒరియెంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పురస్కారం, 2007లో కార్నేజ్ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అవార్డు, 2008లో సింగపూర్ ప్రభుత్వం నుంచి హానరరీ సిటిజన్ అవార్డ్, 2009వసంవత్సరంలో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ అవార్డ్.

2009లో ఇటలీ నుంచి గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని ఇటలీదేశ అత్యున్నతపురస్కారం, 2010వసంవత్సరంలో యేల్ యూనివర్సిటీ నుంచి లెజెండ్ ఇన్ లీడర్ షిప్ అవార్డ్, 2012ఏడాదిలో జపాన్ ప్రభుత్వం నుంచి గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ పురస్కారం.

రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, 2016లో ఫ్రాన్స్ గవర్నమెంట్ నుంచి కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ ద హానర్, 2023 మహారాష్ట్ర ఉద్యోగరత్న, వీటితోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను రతన్ టాటా( Ratan Tata Success Story ) అందుకోవడం జరిగింది.



Leave a Comment