Ratan Naval Tata: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ అయిన రతన్ నావళ్ టాటా(86) అనారోగ్యం తో బాధపడుతూ బుధవారం ముంబై లోని బీచ్ క్యాండీ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ రాత్రి 11:30 కు కన్ను మూసారు. ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎస్.చంద్రశేఖర్ ధ్రువీకరించారు.
సోమవారం (అక్టోబర్ 07న) రోజున పలు అనారోగ్య సమస్యల కారణంగా.. హాస్పిటల్లో చేరిన రతన్ నావళ్ టాటా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.
భారతదేశం లో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్న రతన్ నావళ్ టాటా అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగి ఉంటారు. ఆటోమొబైల్స్, స్టీల్ ఫ్యాక్టరీస్ ఇలా ఎన్నో రంగాల్లో రతన్ నావళ్ టాటా అందించిన నాణ్యమైన సేవలు అందరికి తెలిసిన విషయమే. కానీ వీటన్నికంటే ఒక మంచి మనిషి గా రతన్ నావళ్ టాటా గారు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
Ratan Naval Tata Is No More
తన సంపాదనలో 60 శాతం మొత్తం ప్రజలకే దానం చేసారు.. ఫ్రీ హాస్పిటల్స్ , అని ట్రస్ట్ అని ఇలా ఎన్నో కార్యక్రమాలతో వారి సంపాదన అంత దానం చేసేవారు ఇప్పుడు అందరి గుండెల్లో హీరోగా నిలిచి పోయారు. అలాగే మన భారతదేశం లో సామాన్య ప్రజలు కూడా కారు లో ప్రయాణం చేయాలి అని కేవలం లక్ష రూపాయల్లోనే కారు తీసుకొనివచ్చి సంచలనం సృష్టించారు.
అంతే కాదు మన భారతదేశం లో అత్యంత సేఫ్ కారులు తాయారు చేసేది మన రతన్ నావళ్ టాటా గారే అని ఒక నమ్మకాన్ని కూడా వారు తెచ్చుకున్నారు. ఇలా భారతదేశం యొక్క ప్రజల పట్ల రతన్ నావళ్ టాటా గారు ఎప్పుడు ప్రేమతో, నిజాయితీగా ఉంటూ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు.
కానీ ఇప్పుడు అలంటి మహనీయుడు , ఉత్తమపురుషుడు మన మధ్య ఇక లేరు అనే వార్త ఎంతో బాధ కలిగిస్తుంది. దీనితో దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారవేత్తలు , సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా నివాళ్లు అర్పిస్తున్నారు. రతన్ నావళ్ టాటా గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మన మార్కాపురం టీం కోరుకుంటుంది.
Also Read: దసరా పండుగ విశిష్టత.. చరిత్ర ప్రకారం దసరా పండుగకు ప్రాచుర్యంలో ఉన్న కథలు ఎన్ని..?